స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా వచ్చిన పుష్ప ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు. ఇక పుష్ప ఫస్ట్ లుక్ చూసిన తెలుగు ప్రేక్షకులకు ఒక డౌట్ రాకమానదు. ఈ పుష్ప సినిమానే కదా సుకుమార్ మహేష్ తో తీద్దామనుకున్నది. అంటే మహేష్ ను కూడా ఇంత ఊర మాస్ పాత్రలో కనిపించేలా చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ మాత్రం కథ బాగున్నా క్యారక్టరైజేషన్ మార్చమని చెప్పి మొత్తానికే ఆ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాడు. 

 

ఇదిలాఉంటే పుష్ప ఫస్ట్ లుక్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరో ఎప్ప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయలేదు కదా మంచి ఛాన్స్ మిస్సయిందని అనుకుంటున్నారు. అసలు మహేష్ పుష్ప లుక్ లో ఊహించుకుంటే బొమ్మ మాములుగా ఉండదని అర్ధమవుతుంది. అయితే ఎప్పుడు డీ గ్లామరస్ రోల్ చేసేందుకు సుముఖత చూపించని మహేష్ పుష్ప లాంటి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని తెలుస్తుంది. 

 

మహేష్ కు ఎంత చెప్పినా కథ నచ్చకపోవడంతో వెంటనే అల్లు అర్జున్ కు కథ చెప్పి అతని చేత ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు సుక్కు. ఒకవిధంగా మహేష్ కాదన్న ఈ సినిమాను హిట్టు కొట్టి చూపించాలి అనే కసితో కనిపిస్తున్నాడు సుకుమార్. ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ పుష్ప నేషనల్ వైడ్ గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పుష్ప లుక్ చూసిన మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా సుకుమార్ బన్నీ కలిసి మరో అద్భుతాన్ని సృష్టిస్తారని తెలుస్తుంది.  అల్లు అర్జున్సినిమా తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ మూవీ చేస్తున్నాడు. అటకెక్కింది అనుకున్న ఈ మూవీ యూనిట్ ఈరోజు బన్నీని విష్ చేసి షాక్ ఇచ్చింది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: