అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ఏ.ఆర్.మురగదాస్ ది. కొన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. అంతేకాదు గజనీ కి సీక్వెల్ ని మురగదాస్ అల్లు అర్జున్ తో తీయబోతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో మురగదాస్ తెరకెక్కించిన దర్భార్ భారీ డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు ఈ సినిమా పోవడం తో డిస్ట్రుబ్యూటర్స్ రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా మాటల దగ్గరే ఆగిపోయింది. ఇక గీత గోవిందం లాంటి 100 కోట్ల వసూళ్ళు సాధించే సినిమాని తీసిన పరశురాం తో కూడా బన్ని సినిమా ఉంటుందన్న టాక్ కూడా వచ్చింది. ఇక విక్రం కె. కుమార్ కూడా బన్నీ కోసం కథ రెడీ చేశారని వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందన్న మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాని కారణం ఏంటో గాని అది కూడా ఆగిపోయింది.

 

అయితే ఇంతమంది బన్నీ కోసం ఎదురు చూసినా వీళ్ళందరిని పక్కన పెట్టి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలోలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రివీల్ చేశారు. ఈ టైటిల్ కి బన్నీ లుక్ కి ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని కూడా రివీల్ చేశారు. మాస్ లుక్ లో చూడగానే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యోలా అదిరిపోయింది. 

 

ఇక నిన్నటి వరకు టాప్ సీక్రెట్ గా ఉంచిన పుష్ప సినిమా పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోంది అంటూ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ బృందం. పుష్ప టైటిల్ లోగోని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ చేసి ఇది పాన్ ఇండియా సినిమా అని ఫుల్ క్లారిటి ఇచ్చారు. దీంతో బన్ని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప పోస్టర్ చూసి చాలా ఎగ్జైట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఇంత త్వరగా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వస్తుందని అనుకోలేదంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతూ ఆనందం లో మునిగి తేలిపోతుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: