నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియెన్స్ అంతా కోరుకునేది బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్. ఆయన డైలాగ్ చెబుతుంటే వచ్చే కిక్కు మాములుగా ఉండదు. ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరచగా ఆ తర్వాత వచ్చిన రూలర్ కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. అందుకే తనకు సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. 

 

సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు అంతరాయం కలిగింది. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఒక పాత్ర అఘోరాగా కనిపిస్తుందట. అయితే ఈ పాత్రకు సినిమాలో డైలాగ్స్ ఉండవని అంటున్నారు. 

 

ఫిలిం నగర్ నుండి వచ్చిన లీకులను బట్టి చూస్తే బాలకృష్ణ అఘోరా లుక్ తో అదరగొడతాడట. ఈ పాత్రకు బోయపాటి శ్రీను డైలాగ్స్ మాత్రం రాయట్లేదని అంటున్నారు. బాలయ్య అంటేనే డైలాగ్స్ కేక అనిపించేలా చెబుతాడు. అలాంటిది రెండు పాత్రల్లో ఒక పాత్రకు డైలాగ్స్ లేకుండా చేయడం నందమూరి ఫ్యాన్స్ ను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి. 

 

షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ఇయర్ దసరాకి మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. మరి లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడ్డది కాబట్టి సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చెప్పొచ్చు.  ఎలా చేసినా.. ఏం చేసినా బాలయ్య మాత్రం ఈ సినిమాతో మళ్ళీ షాక్ ఇచ్చేలా ఉన్నాడు.   

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: