సుకుమార్ సినిమా అంటే ఏ హీరో అయినా ముందు కథ అడగకుండానే డేట్స్ ఇచ్చేసేంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సుకుమార్ కోసం మెగాస్టార్ కూడా సినిమా చేయాలన్న ఉత్సాహాన్ని చూపించారంటే ఇండస్ట్రీలో సుకుమా మీద నమ్మకం ఎలాంటిదో తెలుస్తుంది. ఇక సుకుమార్ అంటే అల్లు అర్జున్ ఎలాంటి నమ్మకం ఉందో అందరికీ తెలిసిందే. గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న పేరు ఆర్య తో తెచ్చి పెట్టి ఈ రోజు ఈ రేంజ్ లో పాపులారిటీని తెచ్చాడు సుకుమార్.

 

అందుకే సుకుమార్ డెబ్యూ సినిమా ఆర్య నుండే ఇద్దరికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ ఇద్దరికి మరో గట్టి బలం రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్. ఆర్య సినిమా నుండి సుకుమార్-అల్లు అర్జున్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ అంటే ఆ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్....సినిమా పరంగా సూపర్ హిట్ అని ఇండస్ట్రీ తో పాటు ప్రేక్షకులందరూ డిసైడైపోతారు. 

 

అంతేకాదు ఈ లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించే ప్రతీ సినిమాకి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తాడు. కొన్నిసార్లు మిగతా సినిమాలకైనా మ్యూజి కాస్త అటు ఇటు అయిందేమో గాని సుకుమార్ సినిమా అంటే మాత్రం దేవీ ఇచ్చే మ్యూజిక్ ఆల్బం బ్లాక్ బస్టర్ అని బ్లైండ్ గా ఫిక్సైపోతారు. ఇక సుకుమార్ తెరకెక్కించిన  రంగస్థలం సినిమాకి దేవీ శ్రీప్రాసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా హిట్ కి మేయిన్ ఎసెట్ అయింది.

 

సినిమా చరణ్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినప్పటి నుంచే బన్నీ కి అలాంటి కథ అలాంటి పాత్రలో నటించాలని రంగస్థలం సినిమా చూశాక సుకుమార్ తో అల్లు అర్జున్ చెప్పాడట. ఆర్య, ఆర్య 2 లో చూపించినట్టు స్టైలిష్ గా కాకుండా రంగస్థలం లో రాం చరణ్ లా మాసీగా గెటప్ లో చూపించమన్నాడట. 

 

ఆ రోజు బన్నీ అలా చెప్పడంతో సుకుమార్ అల్లు అర్జున్ కోసమే పుష్ప కథ ని చాలా సమయం తీసుకొని సిద్దం చేశాడు. ఒకే ఒక్క సిట్టింగ్ లో ప్రాజెక్ట్ ని ఫైనల్ చేశాడట. అంటే అల్లు అర్జున్ కి ఈ కథ ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మేకోవర్ తో నన్ను ఎంత రఫ్ గా తయారు చేస్తావో ప్లాన్ చేసుకో అని చెప్పాడట అల్లు అర్జున్.

 

దాంతో సుకుమార్ రక రకాల గెటప్స్ చెప్పాడట సుకుమార్ అల్లు అర్జున్ కి. చెప్పిన అన్నిటికంటే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న గెటప్ విపరీతంగా నచ్చి ఫైనల్ చేశాడట. ఇక వాస్తవంగా ఈ సినిమాకంటే ముందు చేయాల్సిన సినిమా ఐకాన్. కాని ఆ ప్రాజెక్ట్ డిలే అవడంతో సుకుమార్ తో పుష్ప సినిమాకొసం రెడి అయ్యాడు. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: