సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరో - హీరోయిన్స్, డైరెక్టర్ - హీరో డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ .. ఇలా ఎలాంటి కాంబినేషన్ అయినా సక్సస్ ఫుల్ గా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడితే వాళ్ళకి ఇండస్ట్రీలో అలాగే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగా ఉంటాయి. రాజ మౌళి - కీరవాణి, మణి రత్నమ ఏ.ఆర్.రెహమాన్, బాలకృష్ణ - బోయపాటి శ్రీను ఇలా చా కాంబినేషన్స్ ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ కాంబినేషన్స్ గా నిలిచాయి. 

 

అలాంటి కాంబినేషనే సుకుమార్ దేవీ శ్రీప్రసాద్. సుకుమార్ డెబ్యూ సినిమా 'ఆర్య' నుండి 'రంగస్థలం' వరకు సుకుమార్ సినిమాలన్నిటికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రాద్ మాత్రమే సంగీతం అందించారు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఈ ఇద్దరి కాంబినేషన్ కొనసాగుతుంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మ్యూజిక్ మాత్రం మంచి హిట్ ఆల్బం గా నిలిచింది. ఈ నేపథ్యంలో బన్నీ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'కి కూడా సుకుమార్.. దేవీశ్రీ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ కి దేవీ అద్భుతమైన ట్యూన్స్ రెడి చేసే పనిలో ఉన్నాడట. 

 

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ - బన్నీ సినిమాకి 'పుష్ప' అనే టైటిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలోని బన్నీ ఫస్ట్ లుక్ విడుదల చేయగా బన్నీ ఫ్యాన్స్ నుండే కాదు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషలలో విడుదల చేయనున్నారు. ఈ విషయం కూడా ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచి షాకింగ్ సర్‌ప్రైజ్ గా రివీల్ చేయడం ఆసక్తికరమైన విషయం.

 

ఇక ఈ సినిమాలో బన్నీకి జంటగా  కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని సుకుమార్ 1980 కాలంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా - బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వేణు శ్రీ రాం దర్శకత్వంలో "ఐకాన్" సినిమాలో నటించబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తయారుకాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: