గత ఏడాది డియర్ కామ్రేడ్ తో డిజాస్టర్ ను చవిచూసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ,ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ తో వచ్చాడు. కాంత్రి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. డియర్ కామ్రేడ్ కనీసం ఓపెనింగ్స్ అయినా రాబట్టింది కానీ ఫేమస్ లవర్ మాత్రం ఫుల్ రన్ లో 10 కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను  జెమినీ టీవి సొంతం చేసుకోగా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ దక్కించుకుంది. దాంతో ఈనెల 14 నుండి ఈ చిత్రాన్ని సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. 
 
ఇక ఈ చిత్రం తరువాత విజయ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఇటీవల ఈ చిత్రం ముంబై లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తెలుగు తో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈచిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ  అనన్య పాండే నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పై విమర్శలు వస్తున్నాయి. కరోనా వల్ల సినిమా, సీరియళ్ల షూటింగ్ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో  సీసీసీ అనే సంస్థ ను ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నుండి హీరోలు ,ఇతర నటీనటులు ,నిర్మాతలు సీసీసీ కి విరాళాలను ఇచ్చారు కానీ విజయ్ మాత్రం ఇంతవరకు స్పదించలేదు దాంతో విజయ్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ముందుగా తనే స్పందించి విరాళం ఇచ్చే విజయ్ ఇప్పుడు ఎందుకు స్పదించడం లేదో తెలియాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: