ఇప్పటివరకూ మెగాస్టార్ అభిమానులు చిరంజీవి మరియు రామ్ చరణ్ ను ఒకేసారి స్క్రీన్ పై చూశారు కానీ బాబాయ్ అబ్బాయిలు అనగా పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ మాత్రం కలిసి నటించి ఒక్కసారి కూడా వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేయలేదు. మళ్లీ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కలిసి జంటగా ఒక సీన్ లో నటించారు. అయితే తాజాగా బయటికి వచ్చిన విషయం ఏమిటంటే త్వరలోనే బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు కలిసి ఒక సినిమాలో కనిపించనున్నాడట. ఇప్పుడున్న సమాచారం ప్రకారం కాంబో త్వరలోనే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.

 

పవన్ కళ్యాణ్ సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఒకేసారి మూడు సినిమాలకు సంతకం చేయడం కొద్ది నెలల ముందు పెద్ద సంచలనం గా మారింది ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వకీల్ సాబ్ కాకుండా పవన్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం వారం రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రం లాక్ డౌన్ వల్ల తన నిర్దేశిత షెడ్యూల్ వాయిదా వేసుకుంది.

 

ఇకపోతే చిత్రంలో ఒక స్టార్ గెస్ట్ రోల్ చేసేందుకు అవకాశం ఉన్నందున రోల్ రామ్ చరణ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని క్రిష్ భావించారట. ఇదే విషయం పవన్ కు చెబితే అతను కూడా సరే అని లాక్ డౌన్ అయ్యాక చరణ్ ను కలవమని కృషి చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో ఒక కీలక పాత్ర చేయనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ ఆచార్యకే డేట్స్ ఇస్తాడో లేదో అన్నది తెలియదు. మరి అలాంటి పరిస్థితులలో పవన్ సినిమాకు డేట్స్ ఇస్తాడా అన్నది అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: