కరోనా బారినపడి దేశమంతా లాక్ డౌన్ కారణంగా విపరీతమైన అవస్థలు పడుతున్న నేపథ్యంలో మోడీ లాక్ ఎత్తివేసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశాడు. మరొకవైపు కనీసం కేసుల సంఖ్య అయినా తగ్గుతుంది అనుకుంటే రోజురోజుకి కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభిస్తోంది. ఇక మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే విలయతాండవం చేస్తుంది అని చెప్పాలి. ఒక్క రాష్ట్రం లోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి అంటే దాదాపు నాలుగవ వంతు కేసులు రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. ఇది చాలదన్నట్టు వేలాది మంది అనుమానితులు క్వారాంటైన్ లో ఉన్నారు.

 

రాష్ట్ర రాజధాని మరియు భారత దేశ ఆర్థిక రాజధాని అయిన ఒక్క ముంబై లో నే 800 పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ముంబైలో లాక్ డౌన్ అత్యంత పకడ్బందీగా జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర మున్సిపల్ అధికారులు ఇప్పుడు కొత్త ఆంక్షలు విధించారు. అసలు ప్రజలను బయటకు రానివ్వని మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించారు.

 

ఇకపోతే ముంబై మహానగరాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించిన ప్రభుత్వం నగరంలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారిని తక్షణమే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇక వారి పద్ధతి మార్చుకోకపోతే జైలుకు పంపించేందుకు ఇంకొకసారి ఆలోచించమని కూడా వారు తేల్చి చెప్పేశారు. 2 కోట్లకు పైగా జనాభా ఉన్న మహానగరం ముంబై. మహానగరంలో ప్రస్తుతం కరోనా తాండవిస్తోంది. ఏకంగా 782 కరోనా కేసులు నమోదు కాగా దాదాపు 50 మరణాలు సంభవించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: