దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతమైన వేగంతో విస్తరిస్తున్న సమయంలో లాక్ డౌన్ చాలా పకడ్బందీగా అమలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు మరియు బాధ్యతారాహిత్యం గల వారు నిర్లక్ష్యంగా ఇంకా రోడ్ల మీదకు వచ్చి తిరుగుతున్నారు. కొన్నిచోట్ల అయితే ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ పోలీసుల మీద దాడి చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీనితో లాక్ చాలా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నియమాలను అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేసి జైలు శిక్ష కూడా విధించడానికి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

ఇలాంటి సందర్భంలో ఒక బాధ్యత గల మహిళ చేసిన పని ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకం గా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలోని మువత్తుపుజా లో ఒక వివాహిత లాక్ డౌన్ పాటించకుండా బయట తిరుగుతున్న తన భర్త బైక్ నెంబర్ తో సహా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. తన భర్తపై కేసు నమోదు చేసి తగిన శిక్ష విధించాలని ఆమె కోరగా.... అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలని భావించిన పోలీసులు ఆమెను ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు.

 

అయితే ఆమె దానికి ఒప్పుకోకుండా ఇతను మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారని బైక్ వేసుకుని ఊరంతా తిరుగుతున్న అతని వల్ల తనకు మరియు తన పిల్లలకి హాని జరుగుతుందని భయంగా ఉందని చెప్పుకొచ్చింది. పలుమార్లు నచ్చజెప్పినా అతను వినకపోవడంతో తాను నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.  ఆయనతో మా కుటుంబానికి కూడా ప్రమాదమే అని మహిళ పోలీసులకి తెలియజేసింది.ఇక తప్పని పరిస్థితిలో భార్య ఫిర్యాదు మేరకు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: