టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల కొరత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అగ్ర సినిమాలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకడం లేదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు అవకాశాల కోసం ఎక్కువగా తిరుగుతూ ఉండే వాళ్ళు కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ నిర్మాతలు కొందరు పెట్టే ఇబ్బందులే అనేది ఒక కారణం అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. తమకు ఇమేజ్ రావడం లేదు అనే భయం హీరోయిన్లకు ఎక్కువగా ఉందని అంటున్నారు. 

 

తమను కేవలం హీరోయిన్ గా లేదా ఐటెం గర్ల్ గా మాత్రమే చూస్తున్నారు తెలుగు లో అనే భావనలో హీరోయిన్ లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా బయటకు రావాలో అర్ధం కాని పరిస్థితి. అగ్ర హీరోలతో సినిమా చేస్తే కనీస ప్రాధాన్యత ఉండటం లేదు అనే భావనలో హీరోయిన్ లు ఉన్నారు ఇప్పుడు. సినిమా కమర్షియల్ గా విజయం సాధించినా సరే తమకు ఏ విధంగా కూడా గుర్తింపు లేదని ఇప్పుడు హీరోయిన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శకులు కూడా ఇప్పుడు దీనికి పరిష్కారం కనుక్కోలేని స్థితిలో ఉన్నారు అనేది అర్ధమవుతుంది.

 

చిన్న చిన్న హీరోయిన్ లు అయితే అసలు ఎందుకు పనికొచ్చే అవకాశం లేదనే భావనలో అగ్ర దర్శకులు నిర్మాతలు ఉన్నారు. అందుకే టాలీవుడ్ వైపు హీరోయిన్ లు చూసే సాహసం చేయడం లేదని సమాచారం ఇతర భాషల్లో అయితే హీరోయిన్ కి కాస్తో కూస్తో విలువ ఉంటుంది అని తెలుగులో మాత్రం అది ఏ విధంగా కూడా ఉండటం లేదని వాళ్ళు వాపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయన్ ల కొరత ఎక్కువగా ఉంది. హీరోయిన్ లు కూడా ఎక్కువగా వచ్చే ప్రయత్నమూ చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: