మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఏప్రిల్ 9న వచ్చిన ఘరానామొగుడు, బావగారూ.. బాగున్నారా సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. నేటితో ఘరానామొగుడుకు 28 ఏళ్లు.. బావగారూ.. బాగున్నారాకు 22 ఏళ్లు పూర్తయ్యాయి. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఘరానా మొగుడు చిరంజీవి కెరీర్లో ఓ పెను సంచలనం. తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ సాధించింది. దక్షిణాదిలోనే తొలిసారి 10కోట్ల షేర్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో చిరంజీవి 1కోటి 25లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి ఇండియన్ హీరో అయ్యాడు.

IHG

 

ఘరానామొగుడు ప్రభంజనానికి బాలీవుడ్ మ్యాగజైన్ ది వీక్ లో ‘బిగ్గర్ దేన్ బచ్చన్’ అంటూ చిరంజీవి ముఖచిత్రంతో ఆర్టికల్ వేశారు. బంగారు కోడిపెట్ట పాటలో చిరంజీవి డ్యాన్స్ కు ధియేటర్లు హోరెత్తిపోయాయి. కె.దేవీవరప్రసాద్ నిర్మాతగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 56 కేంద్రాల్లో శతదినోత్సవంతో పాటు 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. గుంటూరులో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ గెస్ట్ గా వచ్చారు. అశేషంగా వచ్చిన చిరంజీవి అభిమానులను చూసి.. ‘ఓ వ్యక్తి కోసం ఇంతమంది వస్తారా’ అంటూ ఆశ్చర్యపోయాడట.

IHG

 

తమిళ్ లో రజినీకాంత్ చేసిన మన్నన్ కు రీమేక్ ఘరానామొగుడు. రజినీ.. ఘరానామొగుడును చూసి ‘ఈ సినిమాను ఇలా తీయోచ్చా.. నేను మళ్లీ రీమేక్ చేసుకోవచ్చు’ అన్నారట. ఈ సినిమాలో చిరంజీవి మేనరిజమ్స్ ఓ సంచలనం. 1998 ఏప్రిల్ 9న విడుదలైన బావగారూ బాగున్నారా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 54 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుని చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. నాగబాబు నిర్మించిన ఈ సినిమాకు జయంత్ దర్శకత్వం వహించారు. చిరంజీవి కామెడీ టైమింగ్, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్.

Image

మరింత సమాచారం తెలుసుకోండి: