కోవిడ్ 19 విజృంభిస్తున్న సమయంలో ప్రపంచమంతా జనాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. మనదేశంలో రోజు రోజుకీ కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. లాక్డౌన్ ని పాటిస్తున్నా కూడా కరోనా వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య పెరుగుతుండడంతో జనాల్లో భయం ఇంకా పెరిగింది. అందువల్ల లాక్ డౌన్ ని పొడిగించాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. మరో పదిహేను రోజులా పాటు లాక్ డౌన్ అమలు చేస్తేనే గానీ కరోనా వ్యాప్తిని అరికట్టలేమని చెబుతున్నారు.

 

అయితే కరోనా వల్ల చిన్న తరహా పరిశ్రమ నుండి భారీ పరిశ్రమల వరకు ప్రతీదీ దెబ్బతింది. సినిమా రంగంపై కరోనా ప్రభావం బాగా పడింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. సినిమా షూటింగులు ఆగిపోయాయి. మొదలు కావాల్సిన సినిమాలు అక్కడే ఆగిపోయాయి. దీనివల్ల థియేటర్లకి చాలా నష్టం వచ్చింది. ఈ నష్టం మరికొన్ని రోజులు కొనసాగేలా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లాక్డౌన్ తీసెసిన తర్వాత కూడా జనాలు థియేటర్లకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

 

సామాజిక దూరం పాటిస్తేనే కరోనాని అడ్డుకోగలం అన్న కాన్సెప్ట్ తో ప్రజలు థియేటర్లకి వచ్చే అవకాశం చాలా తక్కువ. అందువల్ల థియేటర్ యాజమాన్యాలు సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు. థియేటర్లోనూ సామాజిక దూరం పాటించడానికి వీలుగా ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునేలా ఏర్పాటు చేస్తారట. అంటే మనకి, అవతలి వారికి ఒక సీట్ గ్యాప్ ఉంటుంది.

 

ఈ విధంగా చేస్తే అయినా జనాలు థియేటర్లకి వస్తారని అనుకుంటున్నారు. అంతే కాదు పరిశుభ్రతని పాటించి, ఎక్కడా ప్రేక్షకులకి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారట. ఈ కష్టకాల సమయంలో ప్రేక్షకులని థియేటర్లకి రప్పించాలంటే ఇదొక్కటే మార్గమని అంటున్నారు. మరి థియేటర్ యాజమాన్యాల ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: