నిన్న కరోనా వార్తలతో పాటుగా మీడియాలో అల్లు అర్జున్ వార్తలు కూడ తెగ హడావిడి చేసాయి. బన్నీ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసారు. అయితే నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజుతో పాటుగా అకిరా నందన్ పుట్టినరోజు అన్న విషయం పవన్ అభిమానులకు గుర్తు ఉన్నా ఎందుకో పెద్దగా సందడి చేయలేదు. 


అయితే చిరంజీవి మాత్రం అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా అతడిని అభినందిస్తూ పెట్టిన మెసేజ్ నిన్న పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. అకిరా ను పవన్ వారసుడుగా చూడాలి అని కలలు కంటున్న పవన్ అభిమానులకు నిన్న చిరంజీవి పెట్టిన మెసేజ్ కొండంత బలాన్ని ఇచ్చింది. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6'4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే  మించిపోవాలి. విష్ యూ ఏ `పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ మెగా స్టార్ చిరంజీవి పెట్టిన మెసేజ్ పవన్ అభిమానులలో జోష్ ను తీసుకు వచ్చింది. 


అయితే నిన్న అకిరా పుట్టినరోజు అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ నుండి అకిరా కు విషస్ వస్తాయని పవన్ అభిమానులు నిన్న అంతా ఎదురు చూసారు. అయితే చాల విషయాలలో మౌనం వహించే పవన్ కళ్యాణ్ తన తీరును అకిరా పై కూడ కొనసాగిస్తూ అకిరా కు కనీసం పుట్టినరోజునాడు శుభాకాంక్షలు కూడ తెలపక పోవడంతో కొందరు గృహ నిర్భందంలో ఉన్న పవన్ తన కొడుకు పుట్టినరోజు కూడ మర్చిపోయాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


అంతేకాదు పవన్ అభిమానులు కూడ ఈ విషయమై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టాప్ హీరోలు అంతా తమ పిల్లలను ఎంతో గారాభంగా చూస్తూ వారు ఏ చిన్నపని చేసినా మురిసిపోతుంటే పవన్ కనీసం తన కొడుకు పుట్టినరోజు విషయం కూడ మర్చిపోవడం ఏమిటి అంటూ ఆవేదన చెందుతున్నారు. దీనితో రానున్న రోజులలో అకిరా హీరోగా అవ్వాలని ప్రయత్నించినా పవన్ వైపు నుండి చెప్పుకోతగ్గ సహకారం ఉండదా అన్న సందేహాలు కూడ పవన్ అభిమానులను కలవర పెడుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: