సన్నీ లియోన్ ప్ర‌పంచ వ్యాప్తంగానే తిరుగులేని పాపుల‌ర్ ఇమేజ్ స‌న్నీ సొంతం ఇండో కెన‌డియ‌న్ అయిన స‌న్ని పోర్న్ స్టార్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ప్ర‌పంచంలోనే తిరుగులేని పోర్న్ స్టార్ అయిన స‌న్నీ ప్ర‌స్తుతం ఆ ఇమేజ్ అంతా ప‌క్క‌న పెట్టేసి భార‌త్‌లో సెటిల్ అయిపోయింది. ఇక్క‌డ అటు బాలీవుడ్ సినిమాల‌తో పాటు ద‌క్షిణాది సినిమాల్లో కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తూ వ‌స్తోన్న స‌న్నీ రంగుల ప్ర‌పంచం అయిన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.

 

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంట‌ర్నెట్లో ఆమె గురించి నెటిజ‌న్లు ఎలా వెతుకుతారో చెప్ప‌క్క‌ర్లేదు. చివ‌ర‌కు ఆమె క్రేజ్ భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీని సైతం మించిపోయింది. గ‌త రెండు మూడేళ్లుగా ఇండియ‌న్ నెటిజ‌న్లు ఎక్కువుగా మోదీ కంటే స‌న్నీలియోన్ గురించే సెర్చ్ చేశారు. నెట్టింట్లో స‌న్నీలియోన్ హాట్... సెక్సీ ఫొటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. సన్నీ ఈ హాట్ స్టైల్ చూసిన వారు ఫిదా అయిపోతారు మరి. 

 

ఇక ఎప్ప‌టిక‌ప్పుడు త‌న బికీని అందాల‌ను... మ‌త్తెక్కించే అందాల ఫొటోల‌ను షేర్ చేసి త‌న అభిమానుల‌కు మంచి కిక్ ఇచ్చే స‌న్నీ తాజాగా వేసిన బికినీ ఫొటోతో సెగ‌లు రేపుతోంది. ప్ర‌స్తుతం క‌రోనా హ‌డావిడి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నా స‌న్నీ మాత్రం బీచ్ ఒడ్డున జీప్ ద‌గ్గ‌ర న‌ల్ల బికీనీతో అంద‌రిని క‌వ్విస్తోంది. సోషల్ మీడియాలో క్రేజీ డాళ్ గా మారిన సన్నీకి 3.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: