ఈ మధ్య కొత్త సినిమాల్లో పాత పాటలని రీమిక్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. పాతట్యూన్లని తీసుకుని ఇప్పటి సౌండ్ ఎక్విప్ మెంట్లతో కొత్తగా ట్రై చేస్తుంటారు. అయితే చాలా సార్లు రీమిక్స్ పాటలు పాత పాటలంతా మాధుర్యంగా అనిపించవు. పాత తాలూకు అనుభవం కొత్తదానిలో క్రియేట్ చేయడం కొంచెం కష్టమే. పాత వాటిని వినీ వినీ అలవాటు పడిపోయుంటాం కాబట్టి రీమిక్స్ అంత త్వరగా తలకెక్కవు.

 

అయితే కొన్ని సార్లు పాత పాటలని రీమిక్స్ అని చెప్పి చెడగొట్టిన సందర్భాలు అనేకం. ప్రస్తుతం ఏ ఆర్ రెహ్మాన్ పాటకి అలాంటి పరిస్థితే కలిగింది. ఏఆ రెహ్మాన్ సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆస్కార్ గెలుచుకున్న ఈ సంగీత దర్శకుడు నిత్యం కొత్తదనం కోసం తపిస్తుంటాడు. అందుకే అందరికి నచ్చే మ్యూజిక్ వస్తుందని అంటుంటారు. అయితే తాజాగా ఏఆర్ రెహ్మాన్ పాటని రీమిక్స్ చేయడం జరిగింది.

 

ఢిల్లీ ౬ లో మసక్కాలి మసక్కాలి అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఢిల్లీ ౬ చిత్రంలోని ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. పాటలో అభిషేక్, సోనమ్ లు వేసే చిన్న చిన్న స్టెప్స్ మనకి గుర్తే. అయితే ఈ పాటని బాలీవుడ్ రీమిక్ పాటల స్పెషలిస్ట్ తనిష్క్ బగ్చీ మసక్కలీ అనే పాటని రీమిక్స్ చేశాడు.

 

సిద్ధార్ట్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించిన ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. కానీ ఒరిజినల్ పాట రేంజ్ అందుకోలేదని విమర్శలు వచ్చాయి. సౌండ్ పరంగానే కాదు, విజువల్ పరంగానూ ఒరిజినల్ సాంగ్ ని రీచ్ కాలేదని, పాటని చెడగొట్టే రకంగానే ఉందని కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ రీమిక్స్ విన అప్సెట్ అయిన రెహమాన్ ఒరిజినల్ సాంగ్  వినండంటూ ట్వీట్ చేశాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: