ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయిన మూవీ పుష్ఫ. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సినిమా టైటిల్ తో పాటు.. బన్నీ ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. ఊరమాస్ లుక్ లో బన్నీ చేస్తున్న స్మగ్లర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో అంటూ ఆసక్తి మొదలైంది. ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా హిందీ, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో తెరకెక్కుతోంది.

 

 

అయితే.. అసలు ఈ సినిమా కథను సుకుమార్ మొదట మహేశ్ కు చెప్పాడు. కానీ.. మహేశ్సినిమా చేయడానకి ఉత్సాహం చూపలేదు. సినిమాలో రఫ్ కంటెంట్ ఎక్కువగా ఉందనే మహేశ్ చేయనన్నాడా.. అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. నిజానికి మహేశ్ ఇంత ఊర మాస్ లుక్ లో ఇప్పటి వరకూ ఏ సినిమా చేయలేదు. బన్నీ సినిమా సినిమాకు లుక్ మార్చేస్తాడు. మహేశ్సినిమా చేసినా తన లుక్ ఒకేలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఇంత ఊర మాస్ లుక్, సబ్జెక్ట్ ఇష్టం లేకే మహేశ్ ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పి ఉంటాడని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.

 

 

సినిమా విషయంలో సుకుమార్ ను మహేశ్ బాగా వెయిట్ చేయించాడని వార్తలు వచ్చాయి. మహేశ్ తీరు నచ్చకే బన్నీని కలిసి సుకుమార్ కథ చెప్పడం.. బన్నీకి నచ్చడం జరిగిపోయింది. అయితే.. కొంతమంది దర్శకులు కొన్ని నెలలు వెయిట్ చేయలేకపోతున్నారు అని మహేశ్ కూడా ఓ సందర్భంలో అన్నాడు. ఈ వ్యాఖ్యలు సుకుమార్ ను ఉద్దేశించే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. పుష్ఫ విషయంలో మహేశ్ నిర్ణయం కరెక్టా కాదా..  అనేది ఫలితంపైనే ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: