నిజానికి సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ఇక ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే మాత్రం ఎదురుదెబ్బలు ఖచ్చితం అని చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణగా ఎంతోమంది సినీ ప్రముఖుల జీవితాలు అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ తను నటిస్తున్న ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉండాలని వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి విషయమే పూజ అదే విషయంలో జరుగుతోంది. నెంబర్ వన్ అనే పదవి కి పూజ ఎవరూ ఊహించని విధంగా జవాబు ఇచ్చింది.

 

 

నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్న ముగ్గురు హీరోయిన్లలో పూజా హెగ్డే మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈమె కు పోటీగా రష్మిక మందాన రేసులో ఉన్న ఆమెకు పెద్దగా ఆఫర్లు లేవు అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇలా ఉండగా పూజా హెగ్డే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాప్ స్టార్ అనే పదానికి ఇప్పుడు తాను మాత్రమే అర్హులని డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. నెంబర్ వన్ హీరోయిన్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది అలాగే బాలీవుడ్ సైడ్ కూడా తను నటించి మంచి పేరు తెచ్చుకోవాలని తన కోరికను బయటపెట్టింది.

 

 

ఈ దెబ్బతో పూజా హెగ్డే కి సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఇంతకుముందు చాలా మంది స్టార్ హీరోయిన్స్ నెంబర్ వన్ అనే పదానికి చాలా దూరంగానే ఉన్నారు అని చెప్పవచ్చు ఈ స్టార్ డమ్ అందుకున్న అప్పటికీ ఆ నెంబర్లు తమకు ఇష్టం ఉండదని పాత్రకు తగిన విధంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కామెంట్స్ మాత్రమే చేశారు. కాకపోతే ఇప్పుడు పూజా హెగ్డే చేసిన కామెంట్స్ కాస్త నెగిటివ్ గా మారుతున్నాయి.

 


ఇందుకు గాను కొందరు సోషల్ మీడియాలో పూజ జగన్ను ఉద్దేశించి అందంగా ఉంటే సరిపోతుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక బ్యూటీ మాత్రమే కాదు యాక్టింగ్ స్కిల్స్ కూడా కాస్త ఉండాలి అంటూ ఆమెకు చురకలంటించారు. అయితే ప్రస్తుతం ఈ హాట్ పూజా హెగ్డే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అలాగే ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: