పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత భారతదేశమంతటా అశేషమైన పాపులారిటీని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా వరుస అట్టర్ ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా, మొన్నీమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా విజయ్ కి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అర్జున్ రెడ్డి సినిమా ప్రభావం కారణంగా తాను ఏ రొమాంటిక్ సినిమాలో నటించినా అర్జున్ రెడ్డి పాత్ర మాత్రమే కనిపించడం ఒక పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. అందుకే విజయ్ ఇకమీదట రొమాంటిక్ సినిమాలలో అసలు నటించనని తేల్చేసి చెప్పేసాడు.


అలాగే తన నెక్స్ట్ సినిమాలు విజయవంతం అయ్యేందుకు తాను ఓ సక్సెస్ మంత్రంని పాటిస్తున్నాడు. అదేంటంటే... ఎటువంటి ప్రయోగాత్మక కాన్సెప్టుల ఒప్పుకోకపోవడం, అలాగే కొత్త డైరెక్టర్లతో సినిమా తీసేందుకు అంగీకరించకపోవడం. ఈ విధానాన్ని పాటించకపోతే తన తదుపరి చిత్రం కూడా డిజాస్టర్ అయ్యే ఛాన్సు ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే... ఏ టాలీవుడ్ దర్శకుడు గానీ, నిర్మాతగానీ విజయ్ తో సినిమా చేసేందుకు ముందుకు రారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండేందుకు విజయ్ దేవరకొండ ప్రస్తుతం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తుంది.


ఇకపోతే విజయ్ దేవరకొండ ఊర మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ ఇతరులతో కలిసి నిర్మించడం గమనార్హం. ఫైటర్ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయడం కారణంగా సినిమా యొక్క షూటింగ్ ఆలస్యం అయ్యిందని సినీ వర్గాల నుంచి టాక్. అలాగే ఇప్పుడు దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... సినిమా షూటింగులు అన్నీ వాయిదా పడ్డాయి. కాస్త లేట్ అయినా విజయ్ సినిమా చిత్రీకరణ ఈ సంవత్సరంలోనే పూర్తవుతుంది. గతంలో మజిలీ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథకి ఫిదా అయిపోయిన విజయ్ తనతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: