ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కడు నిరుపేదల నుంచి సంపన్నుల వరకు కరోనా బూచితో గజ గజ వణికి పోతున్నారు.. మరణిస్తున్నారు.   అమెరికన్‌ సింగర్‌, గ్రామీ, ఎమ్మి అవార్డుల విజేత ఆడమ్ ష్లెసింగర్ కరోనా వైరస్‌ సోకడంతో మృతి చెందారు.  బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు ఎడ్డీ లార్జ్‌ (85)కరోనాతో పోరాడుతూ మృతి చెందారు.   కరోనా మహమ్మారికి మరో సెలబ్రిటీ మృత్యువాతపడ్డారు. హాలీవుడ్‌‌ నటుడు అలెన్‌ గార్ఫిల్డ్‌(80) కరోనా సమస్యల కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే వెల్లడించారు.

 

ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.  న్యూయార్క్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... నిన్న కన్నుమూశాడు. అలెన్ ఆత్మకు శాంతి చేకూరాలి.. నాష్‌విల్లె సినిమాలో త‌న‌కు భర్తగా నటించిన వ్యక్తి కరోనాతో మృతిచెందడం తెలిసి బాధకలిగిందని.. ఆయ‌న కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని తన సోషల్ మీడియాలో చేసిన పోస్టులో పేర్కొంది రోని. నాష్‌విల్లే, ది స్టంట్‌​ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్‌ బాక్సర్‌గా, స్పోర్ట్స్‌ రిపోర్టర్‌గా పనిచేశారు.

 

న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు.  వూడీ అలెన్‌, విమ్‌ వెండర్స్‌ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్‌ జాబులో కనిపించారు. ఈ సినిమా 1986లో రూపొందించారు.  మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు... మృతుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది... నిన్న ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా 87,396 కొత్త కేసులు నమోదు కాగా... 5,362 మంది ఒకేరోజు మృతిచెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: