మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య లో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.మధ్యలో మహేష్ బాబు పేరు కూడా  వినిపించింది. ఇటీవల దీనిపై చిరు క్లారిటీ కూడా  ఇచ్చాడు. ఆచార్య కోసం మహేష్ ను సంప్రదించలేదని అలాగే  రామ్ చరణ్ నటిస్తాడో లేదో తెలియదు ఎందుకంటే చరణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా వున్నాడు. ఒకవేళ డైరెక్టర్ రాజమౌళి ,చరణ్ కు పర్మిషన్ ఇస్తే  నటిస్తాడని వెల్లడించిన విషయం తెలిసిందే.
 
ఇక తాజాగా ఆచార్య కోసం చరణ్ ను ఓ నెల రోజుల పాటు విడిచిపెట్టాలని చిరు అడుగగా అందుకు రాజమౌళి ఒప్పుకుంటున్నట్లు సమాచారం.దాంతో ఆచార్య లో చరణ్ నటించడం కన్ ఫర్మ్ అయ్యింది.  అయితే ఈ సినిమాలో చిరు, చరణ్ తండ్రి కొడుకు పాత్రలో కాకుండా గురు,శిష్యులు గా కనిపించనున్నారని తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుండగా రెజీనా కాసాండ్రా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదలచేద్దాం అనుకున్నారు కానీ కరోనా వల్ల షూటింగ్ కు కు బ్రేక్ పడడం తో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అయ్యేలా లేదు దాంతో విడుదల వాయిదాపడనుంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: