స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం అల... వైకుంఠపురములో.. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 150కోట్ల వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అల్లు అర్జున్ కు కేరళలో కూడా ఫ్యాన్స్ వున్నారని తెలిసిందే. దాంతో ఈ సినిమాను మలయాళం లోకి డబ్ చేసి విడుదలచేశారు. ఈ చిత్రం అక్కడ 3కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే మలయాళ వెర్షన్ ను ఇటీవల సూర్య టీవి మొదటి సారి ప్రదర్శించగా 11.17 టీఆర్పీ ని రాబట్టిందని సమాచారం. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో రేటింగ్స్ రావడం గొప్ప విషయమే.
 
ఇక ఒరిజినల్ వెర్షన్ కూడా త్వరలోనే టీవి లో రానుంది. జెమిని టీవి ఈ సినిమాను ప్రదర్శించనుంది. ఇప్పటికే ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా థమన్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్ , రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. 
 
ఇదిలావుంటే ఈసినిమా తరువాత అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో పుష్పలో నటించనున్నాడు. నిన్న విడుదలైన  ఫస్ట్  లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రానున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ  రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా  ఈఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: