కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారికి భయపడి ప్రజలంతా ఇళ్లకే పరిచయం అయితే.. వైధ్యులు మాత్రం తమ ప్రాణాలను తెగించి వేరస్‌ సోకిన వారికి సాయం వైధ్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా వారి సేవలను గుర్తిస్తూ వాళ్ల సేవలను కీర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ స్టార్ యాక్టర్‌ తన పెద్ద మనసు చాటుకున్నాడు తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.

 

సౌత్ నార్త్ ఇండస్ట్రీలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్‌. ఈ  స్టార్‌ విలన్‌ తన హోటల్‌ను వైధ్య సిబ్బంది  కోసం వినియోగించుకోవాలని ముంబై కర్పోరేషన్‌ అధికారులను కోరాడు. ప్రస్తుతం కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న చాలా మంది వైధ్యులు ఇళ్లకు కూడా వెళ్లకుండా హాస్పిటల్స్‌లోనే ఉంటున్నారు. అలాంటి వారికి తన హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేయాలంటూ ఆయను సూచించాడు.

 

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌ ఖాన్ కూడా తన 4 అంతస్థుల ఆఫీస్ బిల్డింగ్‌ను కరోనా పేషంట్ల క్వారెంటైన్‌ కోసం వినియోగించుకోవాలంటూ సూచించాడు. ఇలా సినీ ప్రముఖులంతా తమ వంతు సాయంగా ప్రజలకు సేవ చేసేందుకు రెడీ అవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🙏

A post shared by Sonu Sood (@sonu_sood) on

మరింత సమాచారం తెలుసుకోండి: