కోలీవుడ్  స్టార్ హీరో విజయ్ - ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. కరోనా లేకుంటే సరిగ్గా ఈ రోజు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేది కానీ కరోనా  ఫ్యాన్స్ ఆశలను తలకిందులు  చేసింది. దీని దెబ్బకు థియేటర్లు ఇప్పట్లో తెర్చుకొనేలా కనిపించడం లేదు దాంతో మాస్టర్ మే లోనైనా విడుదలవుతుందా అనే సందేహాలు వ్యక్తమవువుతున్నాయి. ఇదిలావుంటే ఈ సినిమా నుండి  తాజాగా కొత్త పోస్టర్ ను విడుదలచేశారు. అలాగే త్వరలోనే టీజర్ ను కూడా విడుదలచేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
 
 
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ , ప్రొఫెసర్ గా కనిపించనుండగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు.వీరితోపాటు పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా ఆండ్రియా ,శాంతన్ ,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో నిర్మిస్తున్న ఈచిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మాస్టర్ తెలుగు లో కూడా విడుదలకానుంది. తెలుగు వెర్షన్ హక్కులను యువ నిర్మాత మహేష్ ఎస్ కోనేరు దక్కించుకున్నాడు. ఇటీవల సర్కార్, విజిల్ తో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో  మాస్టర్ పై మంచి అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: