స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.  బన్ని మాస్ లుక్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. రిలీజ్ అయిన రెండు పోస్టర్స్ లో సినిమా కథ ఏంటన్నది చెప్పేశాడు సుకుమార్. నిన్న ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. 

 

ఇక ఈ సినిమా టైటిల్ పుష్ప అని నిన్న ప్రేక్షకులకు చెప్పారు కాని అల్లు అర్జున్ నవంబర్ లో చేసిన ఒక ట్వీట్ చూస్తే అప్పుడే సినిమా టైటిల్ అది అనుకున్నారని తెలుస్తుంది. సుకుమార్ తో తన హ్యాట్రిక్ సినిమా ఎనౌన్స్ చేసే టైంలో సుక్కు హెయిర్ కలర్ మారింది.  నా స్కిన్ మారింది. కాని మా మధ్య ప్రేమ మాత్రం అంతే ఉంది. మేమిద్దరం కలిస్తే వచ్చే మ్యాడ్ నెస్ ఎప్పటికి మారదు. మీరు అందుకు సాక్ష్యం అవుతారు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్వీట్ చివర పుష్ప అని వెరైటీ సింబల్స్ తో అప్పటికే టైటిల్ లీక్ చేశాడు అల్లు అర్జున్. సినిమా మీద పర్ఫెక్ట్ కమిట్మెంట్ ఉన్న ఈ ఇద్దరు కలిసి మరో అద్భుతాన్ని సృష్టించాలని చూస్తున్నారు. 

 

ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరితో పాటుగా దేవి శ్రీ ప్రసాద్ కూడా కలిస్తే ఆ సినిమా మ్యూజిక్ పరంగా కూడా దుమ్ముదులిపేస్తుంది. రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు కొట్టిన సుకుమార్ ఈసారి బాహుబలిని టార్గెట్ పెట్టుకుని పుష్ప చేస్తున్నాడు. పుష్ప కూడా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: