కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ప్రభుత్వానికి తన వంతుగా సహాయం చెయ్యాలని మహేష్ బాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కోటి రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మరిన్ని సాయాలు చెయ్యాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోన కేసులు చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో కొన్ని గ్రామాలను ఆయన దత్తత తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని మహేష్ భావిస్తున్నారు. 

 

ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉండే కొన్ని గ్రామాల విషయంలో మహేష్ బాబు చాలా ముందు చూపుతో వ్యవహరించాలని వారికి ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని మహేష్ భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన ఇప్పటికే తన బావ గల్లా జయదేవ్ తో మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తెనాలి సమీప గ్రామాల్లో కొంత మందికి సహాయం చేసే విధంగా మహేష్ బాబు ఇప్పటికే ఒక ప్లాన్ కూడా చేసారని అంటున్నారు. 

 

భారీగా సహాయం చేయడానికి తన భార్యతో కలిసి మహేష్ బాబు సిదమైనట్టు సమాచారం. ఇందుకోసం ఆయన దాదాపు పది కోట్ల మేర ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారని అంటున్నారు. వాటి ద్వారా కూలి పనులకు వెళ్ళడం కుదరని వారికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి నిత్యావసర సరుకులను ఇవ్వాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మహేష్ తన నిర్మాణ సంస్థ నుంచి కొన్ని నిధులను దీని కోసం కేటాయించారని అంటున్నారు. త్వరలోనే మహేష్ బాబు ఒక్కరే కార్ వేసుకుని ఆ గ్రామాల్లోకి వెళ్ళాలి అని భావిస్తున్నారు. ఇందుకోసం ఒక టీం ని కూడా ఆయన ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: