పంచ్ డైలాగులతో ఎప్పటికి అప్పుడు విజయాలు అందిస్తూ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు ఉన్న పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అందరికీ బ్లాక్ బాస్టర్ హిట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్టార్ హీరో అయినా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, రామ్ ఇలా అన్ని హీరోల సినిమాల హిట్ లిస్ట్ లో పూరి జగన్నాథ్ పేరు కావడం ఆలోచింపచేసే విషయం అనే చెప్పాలి. ఒక మంచి స్టార్ డైరెక్టర్ అయ్యుండి ఇప్పటివరకు తన కొడుకుకి మాత్రం హిట్ అందించలేకపోయారు పూరి జగన్నాథ్. 

 

ఆయన కొడుకు పూరి ఆకాష్ చిన్న వయసులో ప్రతిరోజు ఉదయమే నిద్ర లేవగానే తన తండ్రి ముందు స్టార్ హీరోల చిత్రాల్లోని పంచు డైలాగులు చెప్పి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నాన్న అని పూరి ఆకాష్ అడిగేవాడు. ఇలా ప్రతిరోజూ అడగడంతో పూరి జగన్నాథ్ ఆకాష్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక పూరి ఆకాష్ చిరుత, బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. పూరి ఆకాష్ " మెహబూబా" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమాపై తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా మంచి ఆశలు పెట్టుకున్నా చివరికి హిట్ మాత్రం దక్కలేదు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకొని పూరి జగన్నాథ్ ఆనందపడ్డారు.

 

 

ఒక్క దెబ్బతో మంచి హిట్ రావడంతో ఖచ్చితంగా తన కొడుకు కి మంచి హిట్ ఇవ్వాలని పూరి జగన్నాథ్ చాలా ఆశగా ఉన్నారు. దీనితోపాటు పూరి ఆకాష్ కూడా పూరి జగన్నాథ్ ను అందరికీ బ్లాక్ బస్టర్ లు ఇచ్చావు కదా నాన్న.. నాకు ఒక హిట్టు ఇవ్వండి అంటూ అడిగాడని సమాచారం. అందుకే కాబోలు  మంచి " రొమాంటిక్ " లవ్ స్టోరీని  తీసుకొని సినిమా తీస్తున్నారు. కానీ ఈ సినిమాకు పూరి దర్శకత్వం చేయడం లేదు.. ఈ సినిమాకి అన్ని బాధ్యతలు కొత్త దర్శకుడు అయిన అనిల్ పాడూరి కి అప్పగించారట. ఇక "రొమాంటిక్" టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే పూరి ఆకాష్ సరసన కేతిక శర్మ కూడా అందచందాలతో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక మరి ఈ సారైనా పూరి ఆకాష్ కి హిట్ లభిస్తుందో లేదో చూడాలి ఇంకా..

మరింత సమాచారం తెలుసుకోండి: