టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో హీరోయిన్ కేవలం బొమ్మ అని కేవలం ఆమె అలంకారం మినహా మరొకటి కాదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హీరోయిన్స్ అవసరం గతంలో ఉండేది కాని ఇప్పుడు అంతగా లేదని కొందరు అంటున్నారు. అసలు సినిమాల్లో హీరోయిన్స్ అంత అవసరమా అనే దర్శకులు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో. చాలా మంది హీరోలు హీరోయిన్స్ లేకుండానే సినిమాలు చెయ్యాలని కూడా చూస్తున్నారు. అగ్ర హీరోలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. స్టార్ హీరోలు అయితే హీరోయిన్ కి అంత ప్రాధాన్యత అవసరం లేదని అంటున్నారు. 

 

ఈ నేపధ్యంలో స్టార్ హీరో ఒకరు తాను చేసే సినిమాలో హీరోయిన్ లేకుండా చెయ్యాలని చూస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమా లవ్ స్టోరీ ప్రాధాన్యత ఉన్న సినిమా అయినా సరే హీరోయిన్ కి అంత ఇవ్వకుండా సినిమా చెయ్యాలని చూస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ ని కేవలం ఒక 20 నిమషాలు చూపించి సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. దర్శకుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

ఈ సినిమాను పూర్తి చేయడానికి హీరోయిన్ కి భారీగా ధర కూడా ఇచ్చే ఆలోచనలో నిర్మాత లేరని.. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ని చూపించి తర్వాత ఆమెను పక్కన పెట్టాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ హీరో ఎవరు అనేది తెలియకపోయినా స్టార్ హీరో అని అంటున్నారు. హీరోయిన్ లు ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టారని అందుకే ఆ హీరో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కథ విషయంలో కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: