ఒకప్పుడు టెలివిజన్ రంగంలో దూరదర్శన్ కి ఎంతో ప్రాముఖ్యత ఉండేది.  ఆ కాలంలో వచ్చిన సీరియల్స్ కూడా ఎంతో గొప్ప ఆదరణలకు నోచుకున్నాయి. అలాంటి సీరియల్స్ లో రామాయణం, మహాభారతం.   ప్ర‌స్తుతం కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార‌స‌మాచార శాఖ‌.. మ‌రోసారి రామ‌య‌ణం సీరియ‌ల్‌ను దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం చేస్తుంది.  తొలిసారి రామ‌య‌ణం సీరియ‌స్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది.

 

ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసింది.  తాజాగా  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేస్తారు. రామాయ‌ణం సీరియ‌ల్‌లో సుగ్రీవుడు మ‌రియు బాలి పాత్ర‌ల‌ని పోషించిన ప్ర‌ముఖ న‌టుడు శ్యామ్ సుంద‌ర్ కాళాని క‌న్నుమూశారు. ఈ సీరియ‌ల్‌లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ త‌న సోషల్ పోస్టింగ్  ద్వారా శ్యామ్ చ‌నిపోయార‌నే విష‌యాన్ని ధృవీక‌రించారు. ఆయ‌న‌కి సంతాపం కూడా తెలిపారు. 

 

సుగ్రీవుడు, బాలిగా ద్విపాత్రాభినయం చేసి ఎంతో పాపుల‌ర్ అయిన‌ శ్యామ్‌సుందర్ కాలానీ కొద్ది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు.  2020 ఏప్రిల్ 7 న కల్కాలో నటుడు తుది శ్వాస విడిచిన‌ట్టు తెలుస్తుంది.  కాగా, శ్యామ్ సుంద‌ర్ కాళాని మరణానికి లక్ష్మణ్ పాత్ర పోషించిన నటుడు సునీల్ లాహ్రీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  మా తోటి న‌టుడు శ్యామ్ కలాని  ఆకస్మిక మరణం  చెందార‌నే వార్త న‌న్ను ఎంత‌గానో బాధించింది. వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: