ఓల్డ్ క్లాసిక్స్ అనే పాటలను తమ సినిమాలకు అనుగుణంగా కొందరు రీమిక్స్ చేస్తూ ఉంటారు. కొన్ని పాటలు సక్సెస్ అవుతాయి.. మరికొన్ని రాంగ్ అటెంప్ట్ గా కూడా మిగిలిపోతాయి. ప్రస్తుతం హిందీలో 2009లో హిట్ అయిన ఢిల్లీ 6 సినిమాలో ‘మసక్కలీ..’ పాట ఇలా రాంగ్ అటెంప్ట్ అయింది. హిందీలో రీమిక్స్ స్పెషలిస్ట్ గా సంగీత దర్శకుడు తనీశ్ బగ్చీని చెప్తూంటారు. 2009లో రెహ్మాన్ స్వరపరచిన ఢిల్లీ6 సినిమాలోని మసక్కలీ పాట రీమిక్స్ చేశాడు. ఈ రీమిక్స్ ఫెయిల్ అయింది.

 

 

ఈపాట రీమిక్స్ పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ నటించిన ఆ సినిమాకు మంచి పేరు రావటంతో పాటు పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ పాటలో సిద్ధార్ద్ మల్హోత్రా, తారా సుతారియా నటించారు. ఈ పాటలో ఒరిజినల్ సాంగ్ లోని స్వీట్ నెస్ లేదని అంటున్నారు. పిక్చరైజేషన్ అంటే సినిమాకో రకంగా తీస్తారు. కానీ.. లేటెస్ట్ వెర్షన్ లో మేకింగ్ కూడా నార్మల్ గా ఉండి అట్రాక్ట్ చేయలేకపోయింది. మ్యూజిక్ పరంగా కూడా మంచి ఇన్ స్ట్రుమెంట్స్ వాడకుండా చెడగొట్టాడని అంటున్నారు. ఈపాటపై రివ్యూలు కూడా నెగటివ్ గా రాస్తున్నారు.

 

 

దీంతో తనీశ్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై రెహ్మాన్ సైతం ట్విట్టర్ లో స్పందించాడు. ‘ఓ పాట బయటకు రావాలంటే మంచి ఆలోచన ముఖ్యం. ఎంతో మంది టెక్నీషియన్లు కష్టపడాలి. దర్శకుడి విజన్ ను తెరపై చూపించగలగాలి. అంత కష్టం ఉంటుంది. మసక్కలీ ఒరిజినల్ వెర్షన్ వినండి’ అంటూ లింక్ కూడా షేర్ చేశాడు. తన పాట ఇలా విమర్శలకు గురవటంపై రెహ్మాన్ సైతం అసంతృప్తికి గురయ్యాడని తెలుస్తోంది. ఇటివల రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హయా..హో పాట కూడా తనీశ్ బగ్చీనే చేశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: