నాచురల్ స్టార్ నాని 2019 లో జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలని దక్కించుకున్నాడు. కాని ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సస్ కాలేదనిచెప్పలేము. బాలీవుడ్ లో కూడా జెర్సీ రీమేక్ అవుతున్నప్పటికి తెలుగులో మాత్రం నిర్మాతలకి అనుకున్నంతగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఈ సంవత్సరం నాని తన 25వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏ హీరో అయినా 25వ సినిమా అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. హీరోయిజం ఓ రేంజ్ లో ఉండాలనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా కొత్త పంథాలో వెళుతున్నాడు. తన 25వ సినిమాలో హీరోగా కాకుండా విలన్ గా నటించడం విశేషం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న 'వి' సినిమాతో నాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు బాగా నెలకొన్నాయి.

 

ఒక వైపు 'వి' సినిమాలో విలన్ గా నటిస్తూనే మరో వైపు 'టక్ జగదీష్' సినిమాలో హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో నటిస్తున్నాడు. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో ముగ్గురు అన్నదమ్ముల మధ్య  సంబంధం ఎలా ఉంటుందో చూపిస్తూ దర్శకుడు శివ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే మూడవ సినిమాకు కూడా నాని ఓకే చెప్పాడు. సమ్మర్ లో ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని సన్నాహాలు చేస్తున్నారు.

 

ట్యాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్ సంక్రిత్యన్ నానితో  సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో కథ రెడీ చేసుకున్న రాహుల్ నానీతో సెట్స్ మీదకు వెళ్ళడానికి సన్నాహాలు మొదలు పెట్టాడు. ఇలా వరుసగా రిలీజ్ కి సెట్స్ మీదకి వెళ్ళడానికి నాని ప్లాన్ బాగా వేసుకున్నాడు. గత కొంతకాలంగా హిట్ దక్కకపోవడం తో ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేయాలని చాలానే అనుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన 'వి' సినిమా కరోనా కారణం గా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి. ఇక 'టక్ జగదీష్' సినిమా తో పాటు రాహుల్ సినిమాని కూడా నాని 2020 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నాడు. కాని ఇప్పుడు నాని ప్లాన్స్ అన్ని చెల్లా చెదరైపోయాయి అని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: