టాలీవుడ్ లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్స్ అందరికీ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా నిర్మించాలని అనుకుంటారు. అందుకు ఉదాహరణ సూర్య మూవీస్ అధినేత ఏ.ఎం.రత్నం నే తీసుకోవచ్చు. ఏ.ఎం రత్నం సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా రావడం లేదు. ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రం ఎప్పుడో తీసుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది. ఇక చిన్న దర్శకుల దగ్గర నుంచి స్టార్ డైరెక్టర్ వరకు ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనుకుంటారు. అందుకు బాబి, హరీష్ శంకర్, వేణు శ్రీ రాం లాంటి దర్శకులను ఉదాహరణగా చూపించవచ్చు. అందుకే దిల్ రాజు కూడా పవర్ స్టార్ తో నిర్మించాలని కొన్నేళ్ళుగా కల కన్నాడు.

 

దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమాలో హీరో ఎవరనేది చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకి వస్తుంటారన్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లోనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇప్పటి వరకు చాలా సినిమాలు నిర్మించారు. ప్రభాస్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో కూడా సినిమాల్ని నిర్మించి సక్సస్ ఫుల్ నిర్మాతగా పేరుని దక్కించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్నది ఆయనకి కొన్నేళ్ళుగా ఉన్న కల. ఇప్పుడు 'వకీల్ సాబ్' తో ఆ కల కూడా నెరవేరుతుంది. 

 

అయితే ప్రతీ నిర్మాతకి ఏదో ఒక కల ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా బాగా కొనసాగుతోంది. బాహుబలి సినిమా నుండి మన టాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా మొదలైంది. ప్రతీ నిర్మాత తన సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని ఆరాటపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత దిల్ రాజు కోరిక పాన్ ఇండియా సినిమానే అని అనుకుంటున్నారు. కాని అది సాధ్యపడదని క్లియర్ గా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ లో రిలీజై సూపర్ హిట్ అయింది. కాబట్టి వకీల్ సాబ్ ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించినా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టాక్ సాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా కారణంగా వకీల్ సాబ్ తో భారీ కమర్షియల్ సక్సస్ ని సాధించాలన్న దిల్ రాజు కల కలానే మిగులుతుందా అని ఇప్పుడు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: