టాలీవుడ్ లో మహేష్ బాబు సినిమా అనగానే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. మహేష్ బాబు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అతనికి హీరోలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా ఫాన్స్ ఎక్కువగా ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ జనాలకు కూడా అతని సినిమాలు అనగానే ఒక ప్రత్యేక ఆసక్తి. సినిమా కథ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తారు ఇలా ప్రతీ ఒక్కటి కూడా టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 

 

అయితే ఈ మధ్య కాలంలో మహేష్ బాబు క్రేజ్ అనేది తగ్గుతుంది అంటున్నారు జనాలు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా మహేష్ బాబు కి ఇది వరకు ఉన్న స్థాయిలో క్రేజ్ లేదని అంటున్నారు. దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆయన్ను ఎక్కువగా పక్కన పెట్టడానికే ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు కొందరి తో సినిమా చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినా సరే అవిపెద్దగా ఫలించడం లేదు. అగ్ర దర్శకులు చిన్న దర్శకులు అందరూ కూడా ఆయనను దాదాపుగా పక్కన పెట్టే విధంగానే ఉన్నారు. 

 

దీనితో మహేష్ బాబు లో అసహనం అనేది ఎక్కువగా పెరుగుతుంది అని కొందరు అంటున్నారు. ఒకప్పుడు తన తో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు తనను ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది మహేష్ కి అర్ధం కావడం లేదు. ఇటీవల ఒక అగ్ర దర్శకుడు కూడా మహేష్ బాబు ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సినిమా చెయ్యాలి అని కోరినా సరే ఆ దర్శకుడు మహేష్ బాబు ని అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: