బన్నీ సుకుమార్ తో చేస్తున్న  సినిమాకు టైటిల్ రివీల్ చేశారు. పుష్ప అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో  అల్లు అర్జున్.. ఎవ్వరూ ఊహించని లుక్ లో కనిపించి ఆడియన్స్ ని సర్ ప్రైజజ్ చేశాడు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న స్టోరీ అని ముందు నుంచి  టాక్ నడుస్తున్నా.. అసలు ఇలాంటి కంప్లీట్ వేరియేషన్ లుక్ ని మాత్రం అస్సలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు ఆడియన్స్.
 
రిలీజ్ చేసిన 2 పోస్టర్స్ లో  ఇంటెన్స్ లుక్స్ తో పోలీసులకు చిక్కిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు బన్నీ. అసలు పుష్ప అనేది అమ్మాయి పేరులా కనిపిస్తున్నా.. పుష్పక్ నారాయణ అనే స్మగ్లర్ క్యారెక్టర్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.  అయితే పుష్ప అనేది బన్నీ ఈ సినిమాలో ప్రేమించే అమ్మాయి పేరని కూడా అంటున్నారు. ఈ పుష్ప సినిమాలో ఇంతకీ బన్నీ.. స్మగ్లరా..? కోవర్టా..? లేక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవరా అని రకరకాల డౌట్స్  ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు అందరూ.

రఫ్ గా పుష్ప సినిమా స్టోరీ ఏంటంటే.. రాజు క్యారెక్టర్ లో  పెద్దగా చదువూ, సంధ్యా లేకుండా ఆవారా గా తిరుగుతూ  శేషాచలం అడవుల్లో లారీ డ్రైవర్ పనిచేసే బన్నీ కి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ తో పరిచయం అవుతుంది.  . ఆ ఎర్రచందనాన్ని తన లారీలో స్మగ్లింగ్ చేస్తూ ఆ గ్యాంగ్ కి హెల్ప్ చేస్తూ.. అటు లోకల్ పొలిటీషియన్స్ తో కూడా పరిచయాలు పెంచుకుంటాడు. అప్పుడే పుష్ప అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పుష్ప క్యారెక్టర్ లో రష్మిక.. బన్నీకి జంటగా కనిపిస్తోంది.

వీళ్లందరితో ఎందుకని సొంతగానే ఎర్రచందనం బిజినెస్ స్టార్ట్ చేసిన రాజు ..  అంతకుముందున్న కొన్ని గ్యాంగ్స్ ని ఫినిష్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకుంటారు. అప్పుడు  ఇవన్ని చేస్తోంది నారాయణ్ అని తెలుస్తుంది. నారాయణ్.. అసలు ఈ స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్స్ ని పట్టుకోవడానికి అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. ఈ కథ వింటే పోకిరి సినిమా గుర్తొస్తుంది కదా. మరి అదే ఫార్ములా మరోసారి వర్క్ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి ఈ కథ నిజమో కాదో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: