సినిమా దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే స్టార్ డైరెక్టర్లు అయిపోతారు. ఫలితంగా వాళ్లకి వచ్చే పేరు, రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఏ డైరెక్టర్ అయినా మొదటగా చిన్న సినిమాలు తీసినా, ఒక్కసారైనా స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలని అనుకుంటాడు. చిన్న సినిమాలకి బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే కథ పరంగా చాలా లార్జ్ స్కేల్ లో నిర్మించడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి డైరెక్టర్లంతా స్టార్ హీరోల కోసం ఎగబడుతుంటారు.

 

 

మహేష్ బాబుతో మహర్షి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చిన వంశీపైడిపల్లి అదృష్టం ఏంటోగానీ మొదటి సినిమాకే ప్రభాస్ తో చేసే అవకాశం వచ్చింది. మున్నా సినిమా టైమ్ కి ప్రభాస్ కి ఇప్పుడున్నంత రేంజ్ లేకపోయినా ఛత్రపతి బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హీరో అయిపోయాడు. మొదటి సినిమా ప్రభాస్ తో చేసి, రెండో సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ని పట్టేశాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఎవడు, నాగార్జునతో ఊపిరి, మహేష్ బాబుతో మహర్షి సినిమాలు తీశాడు.

 

 

మహర్షి తర్వాత మహేష్ కోసమే సంవత్సరం పాటు వెయిట్ చేసిన వంశీకి నిరాశే మిగిలింది. దాంతో ఇప్పుడు వంశీ వేరే హీరోలతో సినిమా చేద్దామని ట్రై చేస్తున్నాడు. అయితే అందరి స్టార్ హీరొలతో ట్రై చేసినప్పటికీ, వారు వారి సినిమాలతో బిజీగా ఉండడంతో ఎవ్వరూ వంశీతో సినిమా చేయడానికి రెడీగా లేరు. అయితే స్టార్ హీరోనే కావాలని పట్టుబడితే ఎలా అని చెబుతున్నారు.

 

 

స్టార్ హీరోలు ఖాళీ లేనపుడు చిన్న, మిడ్ రేంజ్ హీరోలతో సినిమా చేసేయడం కరెక్ట్ అని అంటున్నారు. స్టార్ హీరోలు కాదన్న ఈ సమయంలోనైనా వంశీ చిన్న హీరోల దగ్గరికి రావాలి.  మరి ఈ సారైనా స్టార్ హీరోని కాదని మిడ్ రేంజ్ హీరోల దగ్గరకి వస్తాడా లేడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: