చిరంజీవి ఇష్టపడి కొనుక్కున్న కథను పవన్ ముచ్చటపడి అడిగితే... ? చిరంజీవి చేయాల్సిన సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తే.. ? ప్రస్థుతం ఇదే నడుస్తోంది సోషల్ మీడియాలో.  మెగాస్టార్ రీమేక్ చేద్దామనుకున్న లూసిఫర్ రీమేక్ మూవీని పవర్ స్టార్ చేస్తానన్నాడా..? తమ్ముడు అడిగితే  చిరంజీవి ఇచ్చేస్తాడా...?

 

మెగాస్టార్ చిరంజీవి మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ హక్కులను తీసుకున్నాడు. ప్రస్థుతం కొరటాల శివ సినిమా చేస్తున్న చిరు.. ఆ తరువాత లూసీఫర్ కథలో మార్పులు చేయించి.. తాను రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈ కథను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేయబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది.

 

ప్రస్థుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్‌ కల్యాణ్.. ఆ తరువాత హరీష్ శంకర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న పవన్ .. లూసీఫర్ కూడా చేస్తున్నాడు అన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీనీపై మెగాస్టార్ ను కదిలిస్తే.. అలాంటిదేమి లేదు.. ఈ కథ నేనే చేస్తున్నాను అని చెప్తూ.. పవన్  కు ఈ స్టోరీ నచ్చితే, చేయాలని ఉంటే ఇచ్చేస్తాను అన్నారు.

 

లూసీఫర్.. మూవీ పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో నడిచే కథతో రూపొందింది. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఓబెరాయ్ కూడా లీడ్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నాడు. లీడర్ పాత్రలో మెరిపించగలడు పవన్.. ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ నుంచి ఇదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

 

చిరంజీవి చెయ్యాలనుకున్న ఈ కథను  పవర్ స్టార్ పవన్ కల్యాణ్  చిరు నుంచి  తీసుకుంటాడా ?ఇప్పుడు ఉన్న మూడు సినిమాల తరువాత ఈ మూవీపై దృష్టి పెడతాడా.. ? మరిముందే ఖర్చీఫ్ వేసుకున్నచిరంజీవే ఈ సినిమా చేస్తానంటాడా అన్నది మాత్రం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: