లాక్ డౌన్ ఏమో గాని ఇప్పుడు సినీ పరిశ్రమ పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ సినిమా కూడా ఇప్పుడు షూటింగ్ కి వెళ్ళే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేదు. ఏ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు లేవు అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ ఏడాది అసలు సినిమాలను విడుదల చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. మన సినిమా మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. సినిమాల మీద బ్రతికే జనం కూడా ఎక్కువే. 

 

సినిమా హీరో దగ్గరి నుంచి హాల్ దగ్గర పార్కింగ్ వరకు సినిమా మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళే. ఒక సినిమా రావాలి అంటే వేల మంది కష్టం ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సినిమాకు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఈ ఏడాది సినిమాలు విడుదల చేసే ఆలోచనలో ఏ నిర్మాత కూడా లేరు అని సమాచారం. అగ్ర దర్శకులు కూడా ఈ ఏడాది సినిమాలను తాము పూర్తి చేయలేము అని చెప్తున్నట్టు తెలుస్తుంది. చిన్న హీరోల దర్శకులు కూడా ఈ మధ్య కాలంలో సినిమాలను వద్దు అనే ఆలోచనలోనే ఉన్నట్టు సమాచారం. 

 

హీరో కూడా హడావుడి గా సినిమాను పూర్తి చేయలేను అని చెప్తున్నట్టు తెలుస్తుంది. చిన్న హీరోలు అయితే తమకు ఒత్తిడి వద్దు అని చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రతీ దర్శకుడు నిర్మాత కూడా లాక్ డౌన్ ఎత్తి వేస్తే షూటింగ్ లు పూర్తి చేసుకుని సినిమాలను రెడీ చేసుకుందాం గాని ఈ ఏడాది పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి సినిమాల రిలీజ్ వద్దని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: