తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే హీరో అంటే గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి .. స్వయం కృషి మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా తన నటన పాఠవాలతో ప్రజలను నిత్యం మెప్పిస్తూ వారికి వినోదాన్ని అందిస్తూ ఎన్నో సినిమాలలో నటించిన ఘనత మన మెగాస్టార్ చిరంజీవి.అందుకే ఇప్పుడు అందరికి ఆదర్శ ప్రాయం అయ్యాడు. 

 

 

 

విషయానికొస్తే.. చిరంజీవి సినిమాలలో ఒక స్టైల్, ఒక మ్యానరిజం ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే చిరు లాగా ఇప్పటి వరకు ఏ హీరో చెయ్యక పోవడం గమనార్హం. అయన వేసే స్టెప్పులు, అయన చెప్పే డైలాగులు, ఫైట్స్ ఏదైనా కూడా ప్రేక్షకుల గుండెను తాకుతాయి . అందుకే మెగాస్టార్ సినిమా వస్తుందంటే సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్ల నుంచి వెళ్లే వరకు మెగా అభిమానుల సందడి మాములుగా ఉండదు. 

 

 


ఇకపోతే చిరంజీవి ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాలే.. సినిమా పేరు మారుతుంది.. సినిమా డైరెక్టర్ మారుతారు. కానీ చిరంజీవి స్టైల్ మాత్రం ఎక్కడ మారదు. అందుకే గోల్డెన్ లెగ్ అయినా చిరంజీవితో సినిమాలు చేయడానికి ఇప్పటికి చాలా మంది దర్శకనిర్మాతలు పోటీపడుతుంటారు. అది చిరంజీవి అంటే. 

 

 


చిరంజీవి నుంచి  వచ్చిన ఆణీముత్యాలలో ఒకటి ఘరానామొగుడు.. ఈ సినిమా వచ్చి నేటితో 28 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయినా సినిమా క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదని తెలుస్తుంది. ఈ విషయాన్నీ చిరంజీవి ట్విట్టర్ లో  పేర్కొన్నారు. రాఘవేంద్రరా రావు గారి ఘనత ఈ సినిమాసినిమా ఇంత గణ విజయానికి చిత్ర దర్శక నిర్మాతలే కారణమంటూ వారిపై చిరు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: