ఇప్పుడు తెలుగు హీరోలందరి దృష్టి పాన్ ఇండియా సినిమాలపై పడింది. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయాలని చూస్తున్నారు. ఒకరకంగా తెలుగు సినిమాకి ఇది మంచి పరిణామం. మార్కెట్ ఎంత ఎక్కువ పెరిగితే అంత మంచి సినిమాలు వస్తాయి. యూనివర్సల ఆక్సెప్టెన్సీ కథలతో హీరోలు ముందుకు వస్తారు. ప్రభాస్ స్టార్ట్ చేసిన పాన్ ఇండియా ప్రయాణంలో మరికొందరు హీరోలు చేరడానికి ప్రయత్నిస్తున్నారు.

 

 

తాజాగా ఆ లిస్ట్ లో బన్నీ చేరిపోయాడు. అల వైకుంఠపురములో ప్రమోషన్లలో భాగంగా బన్నీ నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అప్పుడే బన్నీకి పాన్ ఇండియా ఆలోచన ఉందని అర్థం అయింది. అయితే అంతకుముందే బన్నీ పాన్ ఇండియా ప్లాన్ వేశాడు. అల వైకుంఠపురములో షూటింగ్ జరుగుతున్నప్పుడే తన తర్వాతి చిత్రంగా ఒప్పుకున్న ఐకాన్ కోసం బాలీవుడ్ భామని వెతికారు. 

 

 

కానీ ఐకాన్ పక్కకి తప్పుకుని, ఆ స్థానంలో సుకుమార్ పుష్ప వచ్చేసింది. దీంతో పుష్ప సినిమానే పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నారు. అయితే పుష్పని పాన్ ఇండియా సినిమాగా మలచడం సరైన నిర్ణయమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప కథ చిత్తూరు ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి తెలుగు నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇతర భాషల వాళ్ళు ఆదరిస్తారా అన్న సందేహం కలుగుతుంది. 

 

 

అయితే సినిమాలో క్యారెక్టరైజేషన్స్ చూస్తే పాన్ ఇండియా మూవీగా పేరు వచ్చేలా కనిపిస్తుంది. బన్నీకి తెలుగుతో పాటు మళయాలంలో కూడా పాపులారిటీ ఉంది. తమిళ ప్రేక్షకుల కోసం విజయ్ సేతుపతి ఉన్నాడు. కన్నడలో తెలుగు సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. ఇక ఒక్క బాలీవుడ్ లోనే బన్నీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే కేజీఎఫ్ వంటి సినిమాల విజయాలను చూస్తే కంటెంట్ ఉంటే ఎక్కడయినా సినిమా ఆడుతుందని అర్థం అవుతుంది. సుకుమార్ సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో తెలిసిందే. కాబట్టి పుష్పతో బన్నీ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: