చిరు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ముదులుపుతున్నాడు. త‌న స‌త్తా.. త‌న ఇమేజ్ ఏమాత్ర‌మే త‌గ్గ‌లేద‌ని.. నిరూపిస్తున్నాడు. వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ కుర్ర‌హీరోల‌కు ద‌డ‌పుట్టిస్తున్నాడు. ఇంత‌కీ తాజా విష‌యం ఏమిటంటే.. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తూనే ఓ యంగ్ డైరెక్ట‌ర్‌కు మెగా చాన్స్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇది హాట్‌టాపిక్‌గా మారుతోంది.  ఆచార్య సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న‌మైన  పాత్రల్లో నటిస్తాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు స‌రికొత్త‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడన్న‌ది స్ప‌ష్ట‌మే. ఎందుకంటే.. ఇప్పటికే లీకైన ఫోటోలను బ‌ట్టి తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇలా న‌డుస్తుండ‌గానే.. చిరు మ‌రో సినిమాకు ఓకే చెప్పేశారు. 

 

మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తాడని ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న*లూసిఫర్* చిత్రం తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చిరు నటిస్తుండగా ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను  సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌కు అప్పగించారు. అయితే.. ఇక్క‌డ చిరు ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట్లు చెప్పారు. సుజీత్ తీసిన చిత్రాలను తాను చూశానని, అతడి టాలెంట్ త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని అందుకే ఈ సినిమాను తీయ‌డానికి అజీత్‌ను ఎంపిక చేసిన‌ట్లు చిరు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక లూసిఫర్ చిత్ర రీమేక్ కోసం సూప‌ర్ స్క్రిప్టును రాయాల‌ని ఇప్ప‌టికే చిరు స్వయంగా సుజీత్‌కు చెప్ప‌డం గ‌మ‌నార్హం. త్వ‌రలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ అవ‌కాశం ఉంది. ఆ ప్ర‌క‌ట‌న కోసం చిరు అభిమానులు ఇప్ప‌టికే నుంచే ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సైరా న‌ర‌సింహారెడ్డితో సంచ‌ల‌నం సృష్టించిన చిరుతో సుజీత్ ఎలాంటి ప్ర‌యోగం చేస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: