సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్లు అన్నాక ప్రేమ‌లు, పెళ్లిళ్లు, డేటింగ్‌లు అన్న రూమ‌ర్లు రావ‌డం కామ‌న్‌. ఏ హీరో, హీరోయిన్ అయినా క‌లిసి రెండు మూడు సినిమాలు చేస్తే ఈ రూమ‌ర్లు కామ‌న్‌గా వ‌స్తుంటాయి. వీటిల్లో కొన్ని నిజాలు కూడా ఉంటాయి. అలాంటి రూమ‌ర్లు ఇప్పుడు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌పై వ‌స్తున్నాయి. ర‌కుల్ చూడ‌డానికి చాలా స‌న్న‌గా, నాజూగ్గా ఉంటుంది. ఆమెకు రెండేళ్ల క్రితం వ‌ర‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. తెలుగు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్‌, మ‌హేష్‌, బ‌న్నీ, చెర్రీల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. 

 

ఇక ర‌కుల్‌కు ఇటీవ‌ల అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. ఇక రకుల్ ప్రేమలో పడిందని, ఎవరితోనో డేటింగ్ చేస్తోందనే రూమర్స్ పెద్దగా వినిపించలేదు. అయితే దీనికి ఓ కార‌ణం కూడా చెపుతోంది ఆమె. తాను చిన్న‌ప్ప‌టి నుంచి అబ్బాయిల‌కు దూరంగా ఉంటాన‌ని.. తన‌పై ఎప్పుడు త‌న త‌మ్ముడు అమ‌న్ ప్రీత్ ఓ క‌న్నేసి ఉంచేవాడ‌ని.. తాను అబ్బాయిల‌తో మాట్లాడితే వెంట‌నే ఇంటికి వెళ్లి అమ్మ‌, నాన్న‌ల‌కు చెప్పేవాడ‌ని.. అందుకే తాను అబ్బాయిల‌కు దూరంగా ఉండ‌డం అల‌వాటు చేసుకున్నాన‌ని చెప్పింది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు భాయ్ ఫ్రెండ్స్ లేక‌పోవ‌డంతోనే త‌న‌పై డేటింగ్ రూమ‌ర్లు.. ప్రేమ‌ల‌న్న గాసిప్పులు రాలేద‌ని చెపుతోంది.

 

ఇక తాను ఇన్నేళ్లుగా సినిమాల్లో ఉన్నా.. ఎంతో మంది స్టార్ హీరోల‌తో న‌టించి.. హిట్లు కొట్టినా త‌న‌పై ఏ హీరోల‌కు లింకులు పెడుతూ ల‌వ్ ఎఫైర్ ఉంద‌న్న రూమ‌ర్లు రాక‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని చెపుతోంది. ఇక త‌న‌కు ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంట‌నే ఎక్స్‌ర్‌సైజులు చేస్తూ.. జిమ్‌లో ఉంటాన‌ని అందుకే త‌న‌తో క‌లిసేందుక కూడా ఎవ్వ‌రు ఇష్ట‌ప‌డ‌ర‌ని చెపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: