రజనీకాంత్ తన   కెరీర్  ను బలంగా నిలబెట్టుకోవడానికి చంద్రముఖి  ఎంతగానో సహాయ పడింది. చంద్రముఖి సినిమా హర్రర్ మరియు కామెడీ  సినిమాగా గుర్తింపు పొందింది. ఈ చిత్రం 1990లో నిర్వహించినటువంటి మలయాళం  'మణిచిత్ర తాళు' ను తమిళ  మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు పి.వాసు రీమేక్ చేసి అందించాడు. ఇప్పటికే కన్నడ, తెలుగు  భాషల్లో చంద్రముఖి సీక్వెల్ వచ్చింది. అయితే ఈ సినిమా కన్నడలో  మంచిగా ఆడిన తెలుగులో నాగవల్లి గా    మెప్పించ లేకపోయింది.

 

తమిళంలో ఎప్పటి నుంచో చంద్రముఖి  సీక్వెల్ కోసం చర్చ జరుగుతోంది. కానీ అది ఇప్పటి వరకు రూపం దాల్చలేదు. పి వాసు రజనీకాంత్ ని ఎంత ఒప్పించాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఎట్టకేలకు తమిళంలో చంద్రముఖి 2 కన్ఫామ్ అయ్యింది. మరి ఇందులో రజినీకాంత్ నటిస్తున్నాడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రజనీకాంత్ ప్రియ శిష్యుడైన రాఘవ లారెన్స్ ఈ   ఈక్వల్ లో నటిస్తున్నట్లు సమాచారం.

 

 కాంచన  సీక్వెల్స్ తో రాఘవ  ఇప్పటికే దర్శకుడిగా, హీరోగా  హర్రర్ కామెడీని  ఓ స్థాయికి తీసుకెళ్లాడు. మరి ఇప్పుడు రజినీకాంత్ హిట్ మూవీని సీక్వెల్ చేస్తున్నాడు. ఇప్పటికే రాఘవ లారెన్స్ కరోనా బాధితుల కోసం మూడు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేశాడు ఆ డబ్బులను చంద్రముఖి 2 కోసం ఇచ్చిన అడ్వాన్స్ నుంచి ఇచ్చినట్టు చెప్పడం విశేషం  రజినీకాంత్ అనుమతితోనే తాను ఈ సీక్వల్ లో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. చంద్రముఖి 2 ని  పి వాసు  డైరెక్షన్ లోనే చేస్తున్నట్టు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. చంద్రముఖి 2 సీక్వెల్ కథ తోనే ఉంటుందో లేక రాఘవ లారెన్స్ సొంత కథతో వస్తున్నాడో వేచి  చూడాలి మరి . 

మరింత సమాచారం తెలుసుకోండి: