ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకాన్ని నిద్రలేకుండా చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వాస్తు ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ వస్తుంది. అయితే కరోనా నియంత్రణలో భాగంగా కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని తెలుస్తోంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు..

 

 

 

కరోనా ప్రభావంతో పెద్దా చిన్న అని తేడా లేకుండా అందరు ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఆదుకోవడానికి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.

 

 


కరోనా నోటి నుంచి ముక్కు నుంచి వ్యాపిస్తున్న నేపథ్యంలో  ప్రజలు మాస్కులను ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఇక గుంటూరులో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వాళ్లకు పోలీసులు లాఠీలతో బుద్ది చెబుతున్నారు..అయితే ప్రజలు పోలీసుల మాటలను పెడ చెవిన పెట్టి బయట దర్జాగా తిరుగుతూ చావును కొని తెచ్చుకుంటున్నారు. 

 

 

 

ఈ సందర్బంగా ప్రజల ఆకలిని తీర్చడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఆ వీడియోలో  అమితాబ్ మాట్లాడుతూ.. ముంబైయిలోని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రోజు రెండుపూటల రెండువేల ఆహార పొట్లాల పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నెలకు సరిపడా నిత్యావసర సరుకులను 3 వేల రైస్ బ్యాగులను అందజేస్తున్నట్లు అన్నారు. అయితే, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పేదలకు సరుకుల పంపిణి చేయడం ఇబ్బందిగా మారిందని అమితాబ్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ముగిసేవరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దోదని హెచ్చరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: