సినీరంగంలో పైకి రావడమంటే అంత సుల‌భం అయితే కాదు. అందం, అభినయాలకు అదృష్టం ఉండే ఇక్క‌డ పైకి రాగ‌లం అన్న‌ది వాస్త‌వం. అవన్నీ కలిసొచ్చిన హీరోయిన్లు మాత్రమే ఇక్కడ ఓ వెలుగు వెలిగారు, వెలుగుతున్నారు కూడా. అలాంటి వారిలో అందచందాలతో, యాక్టింగ్‌తో అప్పట్లో సౌతిండియాను ఓ ఊపు ఊపేసిన‌ నగ్మా కూడా ఒక‌రు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలను షేక్ చేసిన నటి ఈమె. తెలుగులో టాప్-4 హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో నటించిన అతికొద్ది మంది హీరోయిన్లలో నగ్మా ఒకరు. 

 

ఆ కాలంలో యువతకు కలల రాణిగా మారిపోయింది. దక్షిణాది భాషలన్నింట్లోనూ టాప్ హీరోలందరితో నటించి మెప్పించింది. వాస్త‌వానికి  నగ్మా కోసమే యువతరం థియేటర్లకు క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదేమో. ఇక‌ ప్ర‌స్తుతం సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నగ్మా కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా మారారు. అయితే అలాంటి న‌గ్మాకు, జ్యోతిక‌తో చాలా ద‌గ్గ‌ర రిలీష‌న్ ఉంద‌ని అతి త‌క్కువ మందికే తెలుసు. నిజానికి ఒకప్పటి అందాల తార నగ్మా , తమిళ్ హీరోయిన్ జ్యోతిక లు అక్క చెల్లెళ్లు. జ్యోతిక నగ్మా కి స్టెప్ సిస్టర్.. జ్యోతికను ఇండస్ట్రీకి తీసుకువచ్చింది నగ్మానే. 

 

ప్రస్తుతం ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నా.. అప్పుడప్పుడు కలుస్తుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఒక త‌ల్లికి పుట్ట‌క‌పోయినా వీరిద్ద‌రూ ఎంతో ఆప్యాయంగా ఉంటార‌ట‌. న‌గ్మాకు జ్యోతిక అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఇక ఒకప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా జ్యోతిక వెలుగొందింది. తమిళ, తెలుగు, మళయాల మరియు కన్నడ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. నగ్మా తెచ్చుకున్నంత పేరు జ్యోతికకు రాలేదు. కాకపోతే చంద్రముఖి చిత్రం జ్యోతిక కెరీర్‌లో ఓ మైలురాయి. ఆ తర్వాత హీరో సూర్యను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది.

 

 

 


 
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: