కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 21 రోజుల పాటు అంద‌రూ లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఈ లాక్ డౌన్ మ‌రి కొంత కాలం పొడింగించ‌వ‌చ్చ‌న్న‌దానిపై దాదాపు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు బంద్ అయ్యాయి. దీంతో సినిమా వాళ్లు ఇప్పుడు ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఇక సినిమా వాళ్లు బ‌య‌ట‌కు రానిదే అస్స‌లు ఉండ‌రు. ఈ లాక్ డౌన్ నేప‌థ్యంలో త‌మ బ‌ర్త్ డే పార్టీలు.. వీకెండ్ పార్టీలు కూడా ఇప్పుడు చాలా ప‌రిమితంగా ఇళ్ల‌ల్లోనే చేసుకోవాల్సిన ప‌రిస్థితి.

 

అయితే బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌ బర్త్‌ డే(ఏప్రిల్‌ 9) అందుకు భిన్నంగా జరిగింది. ఆమె తాజాగా 32వ వ‌సంతంలోకి అడుగు పెట్టింది. ఈ లాక్ డౌన్ నేప‌థ్యంలో ఎవ్వ‌రూ ఆమె ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే ఛాన్స్ లేక‌పోవ‌డంతో స్వ‌ర్ణ భాస్క‌ర్‌కు కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు చెపితే.. మ‌రికొంద‌రు స్నేహితులు గ్రూప్‌ వీడియో కాలింగ్‌ చేసి ఆమెకు వర్చువల్‌ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్‌ చేశారు. స్వర వర్చువల్‌ బర్త్‌డే పార్టీ నాలుగు గంటలపాటు ఆటా, పాటలతో చాలా ఉల్లాసంగా కొనసాగింది.

 

దీనికి స్వ‌ర్ణ భాస్క‌ర్ రిప్లే ఇస్తూ లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పిన వారు అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు చెప్పింది. తాను అస్స‌లు ఊహించని వర్చువల్‌ పార్టీని సెలబ్రేట్‌ చేయటం చాలా సరదా ఉంది. మీరు కుటుంబసభ్యుల వంటి స్నేహితులని చెప్పడానికి నాకు మాటలు చాలడం లేద‌ని తెలిపింది. ఈమె బ‌ర్త్ డే సెల‌బ్రిటీల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు కూడా ఫాలో అయితే చాలా బెట‌రేమో...!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: