అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన ఫోర్ మోర్‌ షాట్స్ ప్లీజ్‌ వెబ్ సిరీస్‌లో నటించిన అందాల భామ మాన్వీ గంగ్రూ. సక్సెస్‌ ఫుల్‌ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ భామ తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు తనను సంప్రదించిన కొంతమంది నిర్మాతలు తనను ఎలా లొంగదీసుకోవాలనుకున్నారో వివరించింది మాన్వీ.

 

ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంఘటనను గుర్తు చేసుకుంది. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన తన జీవితంలో, తన ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులు కారణమైందని వివరించింది మాన్వీ. ఓ నిర్మాత నుంచి తనకు వచ్చిన కాల్‌ గురించి సవివరంగా వివరించింది మాన్వీ. `ఏడాది క్రితం ఓ కొత్త నంబర్‌ నుంచి నాకు కాల్ వచ్చింది. తనని తాను నిర్మాతగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, తాను తీయబోయే వెబ్‌ సిరీస్‌లో నన్ను నటించాల్సిందిగా కోరాడు.

 

వెంటనే తన బడ్జెట్‌ కూడా చెప్పాడు. అయితే ఆ బడ్జెట్  చాలా తక్కువని.. అయినా ముందు కథ నచ్చితే ఆ తరువాత పేమెంట్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పా. అతను మాత్రం బడ్జెట్ ఓకే అనుకుంటే కథ డిస్కస్ చేద్దాం అని చెప్పాడు. అయితే నేను ఆ పేమెంట్‌కు నటించను అని  చెప్పాశా. కానీ వెంటనే ఆ నిర్మాత నా పేమెంట్‌ను మూడింతలు చేస్తానని అయితే అందుకు మరో విధంగా కాప్రమైజ్‌ కావాలని చెప్పాడు. నేను పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించటంతో అతను కాల్ కట్ చేశాడు. అంతే ఆ తరువాత నాకు తిరిగి కాల్ చేయలేదు` అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది మాన్వీ.

 

గత ఏడాది శుభ్ మంగళ్‌ జ్యాదా సావదాన్‌ సినిమాలో నటించిన మాన్వీ గంగ్రూ, తరువాత ఉజ్డా చమన్లో కీలక పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: