బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సమాజం గురించి తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తుంది. ఏ రాజకీయ నేతనైనా ఏ యాక్టర్ నైనా విమర్శించేంత ధైర్యం తనకు ఉంది. ఐతే గత కొన్ని నెలలుగా ఆమె ఎవరిని ఏ విషయాల పై విమర్శించలేదు, ప్రశంసించలేదు. కానీ తాజాగా మన భారత ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా ఎదుర్కొంటుందో చెబుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


కంగనా రనౌత్ ఓ ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడుతూ...'ఇంటి దగ్గర కూర్చుంటేనే మనమందరం కరోనా వైరస్ పైన చేసే యుద్ధంలో గెలుస్తాం. ఇంట్లో కూర్చుని గెలిసే యుద్ధాలలో బహుశా ఇదే మొదటి యుద్ధం ఏమో. ప్రపంచంలోని ఇతర దేశాలలో లాగానే ఇండియా కూడా ప్రస్తుతం లాక్ డౌన్ పాటిస్తుంది. కోవిడ్ 19 వ్యాధి వ్యాప్తి స్టేజి 3 దాటకముందే మన ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలోనే మోడీ అంత గొప్ప నాయకుడు ఎవరు ఉండరు అని అర్థమవుతుంది. ఓ తెలివైన, అనుభవజ్ఞుడైన పరిపాలనలో భారతదేశం నడుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అలాగే కనిపించని మహమ్మారిపై ప్రతి ఒక్కరిని పోరాడేలాగా చేసిన మోడీకి నా అభినందనలు. మనమందరం ప్రభుత్వాలు చెబుతున్న జాగ్రత్తలు పాటించాలి. సమాజాన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరు మీద ఉంది' అని చెప్పుకొచ్చింది.


అలాగే ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఎగతాళి చేసే వారిపై కూడా ఆమె మండిపడింది. తాను మాట్లాడుతూ... 'సమాజంలో కొంత మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది ఎంతవరకూ సరైనది కాదు. అలాగే చాలామంది ప్రభుత్వ సూచనలను పాటించకుండా ప్రభుత్వానికి తప్పుడు పేరు రావాలని గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అలా తిరగడం వారి ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకోక పోవడం బాధాకరం. లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ప్రజలు బాధపడుతున్నారు. వారి బాధలను తీర్చేందుకు మనకు చేతనైనంత సహాయం చేయాలి' అని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: