టాలీవుడ్ లో మాస్ మహారాజ్ రవితేజ్ కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. చేసే ప్రతి సినిమాను తనదైన స్టైల్లో మాస్ యాక్టింగ్, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం కరోనా సమయంలో అందరిలానే ఇంట్లో ఫ్యామిలీతో గడిపేస్తున్నాడు ఈ మాస్ మహారాజ్. అయితే.. ప్రస్తుతం తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన తన పిక్ వైరల్ అయింది. లాక్ డౌన్ టైమ్ కి యాప్ట్ అయ్యేలా రెగ్యులర్ డేస్ లో ఎప్పుడూ చేయని ఓ ఫోటోను పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అయింది.

 

 

రవితేజ్ తన ఇంట్లోని జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇందులో విశేషమేముందా అంటే.. ఉంది. హీరోలెప్పుడూ కనిపించే లుక్ లో కాకుండా తాను తెల్ల గెడ్డంతో ఉన్న ఫొటోనున పోస్ట్ చేశాడు. జిమ్ లో తెల్ల గెడ్డంతో వర్కౌట్లు చేస్తున్న ఆ ఫొటో కొత్తగా అనిపిస్తోంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండడంతో షూటింగ్స్ లేవు. దీంతో మాస్ మహారాజ్ బద్దకించాడో ఏమో.. గెడ్డంతోనే జిమ్ చేస్తున్నాడు. ఈ ఫొటోకు రవితేజ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘స్టే హోమ్.. స్టే సేఫ్.. స్టే ఫిట్’ అని తన వాల్ లో రాసుకున్నాడు. అందరూ ఇంటిపట్టునే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి అని చెప్తున్నాడు.

 

 

సాధారణంగా హీరోలు ఇలా తెల్ల గెడ్డంలో కనిపించడం అరుదు. అందులోనూ రవితేజ ఫస్ట్ టైమ్ ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. ‘బెంగాల్ టైగర్.. కొత్తగా కనిపిస్తున్నావ్’, ‘మంచి వర్కౌట్’, ‘గుడ్ సజెషన్స్ భయ్యా’ అంటూ నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. వర్క్ పరంగా రవితేజ క్రాక్ సినిమాలో నటించాడు. కరోనా పరిస్థితుల తర్వాత క్రాక్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Stay home stay safe stay fit!

A post shared by ravi TEJA (@raviteja_2628) on

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: