మాజీ మోడల్, ప్రస్తుత బాలీవుడ్ నటి సౌందర్య శర్మ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చిక్కుకుపోయింది. మన భారతదేశంలో విదేశీ విమాన రాకపోకలు ఆగిపోవడం వలన తాను లాస్ ఏంజిల్స్ లో గడపడం తప్ప ఇంటికి వచ్చే అవకాశం అస్సలు లేదని ఆమె తెలిపింది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని అప్లోడ్ చేసి ఇంట్లోనే మాస్క్ ఎలా తయారుచేసుకోవాలో చాలా చక్కగా చూపించి అందరి మన్నలను పొందుతుంది.


ఆ వీడియో లో భాగంగా తాను మాట్లాడుతూ... ' ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం మాస్కుల కొరతతో తల్లడిల్లిపోతున్నాయి. సెలబ్రిటీ అయిన నేను కూడా ఒక్కటంటే ఒక్క మాస్కు ని కూడా కొనలేకపోయాను. అందుకే నేనే స్వయంగా ఒక సరికొత్త మాస్కు ని తయారు చేయాలని నిశ్చయించుకున్నాను. మాస్క్ తయారు చేయడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఎన్నో ప్రయత్నాలు చేయగా ఎట్టకేలకు నేను వ్యాయామం చేసేటప్పుడు ధరించే టీ షర్టు తో ఒక మాస్క్ ని తయారు చేయవచ్చు అని తెలుసుకున్నాను. ఆ టీ షర్ట్ ని రెండు భాగాలుగా కట్ చేసి... మూతి, ముక్కు కవర్ అయ్యేలా ఓ మాస్క్ ని తయారుచేశాను. మూతి, ముక్కు కవర్ చేసుకోకుండా ఉండడం కంటే ఈ టీ షర్ట్ మాస్క్ ధరించడం ఎంతో శ్రేయస్కరం. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి', అని ఆమె చెప్పారు.


అమెరికా దేశంలో కరోనా తీవ్రత చాలా ఘోరంగా ఉందని, భారతదేశానికి వచ్చే పరిస్థితులు ఇప్పట్లో లేవని ఆమె తీవ్ర బాధను వ్యక్తం చేసింది. అమెరికా దేశం లో కరోనా వైరస్ కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న భారతీయుల కోసం ఈమె విరాళాలను కూడా సేకరించింది. ప్రస్తుతం ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కోసం తన వంతు బాధ్యతగా వ్యవహరించాలని, అలా చేస్తే మన భావితరాల భవిష్యత్తు బాగుంటుందని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: