ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌న‌దేశంలో సైతం క‌రోనా మ‌ర‌ణాలు ఇప్ప‌టికే 6500 క్రాస్ అయ్యి ఏడు వేల‌కు చేరుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా మ‌రీ అంత దూకుడుగా కాక‌పోయినా ఓ మోస్త‌రుగా చాప‌కింద నీరులా విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం దేశం అంత‌టా లాక్ డౌన్ స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని అనుకున్న లాక్‌డౌన్ కాస్తా ఇప్పుడు ఏకంగా మ‌రో నెల రోజుల పాటు పొడిగించే ఛాన్స్ ఉంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

 

శ‌నివారం ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ తర్వాత మోదీ దీనిపై క్లారిటీ ఇస్తాడ‌ని అంద‌రూ అంటున్నారు. సినిమా షూటింగ్లు బంద్ కావ‌డంతో సినిమా హీరోలు, హీరోయిన్లు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. కొంద‌రు వంట‌లు చేస్తుంటే.. మ‌రి కొంద‌రు ఇళ్లు ఊడ్చుతోన్న ఫొటోల‌ను త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విష‌యానికి వ‌స్తే ఆచార్య షూటింగ్ ఆగిపోవ‌డంతో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని త‌న ఇంట్లోనే ఉంటున్నారు. అదే టైంలో షూటింగ్లు లేక ఇబ్బందులు ప‌డుతోన్న సినీ కార్మికుల కోసం ఏకంగా తానే ముందుకు విరాళం ఇవ్వడంతో పాటు అంద‌రు హీరోల నుంచి ఏకంగా రు. 7 కోట్ల విరాళాలు వ‌చ్చేలా చేయ‌డంలో ముందున్నారు. 

 

ఇక క‌రోనా మ‌హ‌మ్మారిపై ప్ర‌తి ఒక్క‌రు పోరాటం చేయాన‌లి వీడియో సందేశాలు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్ వేళ ప‌డుతోన్న క‌ష్టాల‌ను ప్ర‌శంసించారు. చిరంజీవి వీడియోలు ఇటు సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఇక శుక్ర‌వారం చిరు వీడియోపై తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి సైతం స్పందించి మీ వీడియోలు మాలో ఎంతో స్ఫూర్తి నింపాయ‌ని కొనియాడారు. ఏదేమైనా ఇలాంటి టైంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ముందుండి అంద‌రిని న‌డిపిస్తూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: