యావత్ ప్రపంచాన్ని నిద్రలేకుండా చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వాస్తు ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తూ వస్తుంది. అయితే కరోనా నియంత్రణలో భాగంగా కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని తెలుస్తోంది.. పేద ప్రజల ఆకలిని తీరుస్తున్న సినీ ప్రముఖులు 

 

 

కరోనా ప్రభావంతో పెద్దా చిన్న అని తేడా లేకుండా అందరు ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఆదుకోవడానికి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.

 

 

కరోనా వ్యాప్తిని  అరికట్టే దిశగా ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తుంటే సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.  

 

 

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. మోహన్ బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ ఎనిమిది గ్రామాల్లో పేదలకు రెండు పూటల ఆహారం అందించడమే కాదు, 8 టన్నుల కూరగాయలను కూడా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ  గ్రామాల్లోని ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు  గ్రామాల్లో సేవలు అందిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: